Virat Kohli: మరోసారి కోహ్లీని టార్గెట్ చేస్తూ నవీనుల్ హక్ పోస్ట్.. దానికి గంభీర్ రియాక్షన్ ఏంటో తెలుసా?
ABN, First Publish Date - 2023-05-07T12:09:07+05:30
ఈ నెల ఒకటో తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో లఖ్‌నవూ బౌలర్ నవీన్-ఉల్-హక్, కోహ్లీ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
ఈ నెల ఒకటో తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ (LSGvsRCB) పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో లఖ్‌నవూ బౌలర్ నవీన్-ఉల్-హక్ (Naveen-ul-Haq), కోహ్లీ (Virat Kohli) మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత కూడా ఆ వివాదం కొనసాగింది. ఆ గొడవలోకి గంభీర్ (Gautam Gambhir) ఎంటర్ అయ్యాడు. దాంతో కోహ్లీ, గంభీర్ మధ్య కూడా గొడవ జరిగింది. ఈ గొడవపై సీరియస్ అయిన బీసీసీఐ (BCCI).. కోహ్లీ, గంభీర్‌లకు వంద శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది. నవీన్-ఉల్-హక్‌కు 50 శాతం మ్యాచ్ ఫీజును ఫైన్‌గా వేసింది.
ఆ వివాదం జరిగి రోజులు గడుస్తున్నా లఖ్‌నవూ బౌలర్ నవీన్-ఉల్-హక్ మర్చిపోయినట్టు లేదు. తాజాగా కోహ్లీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ (Naveen-ul-Haq Insta Post) చేశాడు. గంభీర్, తాను కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ``ఇతరులు మీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో.. మీరు కూడా వారితో అలాగే ప్రవర్తించండి, మీతో ఇతరులు ఎలా మాట్లాడాలని కోరుకుంటారో.. మీరు కూడా వారితో అలాగే మాట్లాడండి`` అని పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై గంభీర్ స్పందించాడు. ``నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అలాగే ఉండు.. ఎవరి కోసమూ నువ్వు మారకు`` అని కామెంట్ చేశాడు.
Ajinkya Rahane: అంత ఆలస్యమెందుకు? రహానే డీఆర్‌ఎస్ నిర్ణయంపై అభిమానుల అనుమానం!
నవీన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో మళ్లీ నిప్పు రాజేసింది. ఈ కామెంట్‌పై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి. కాగా, బీసీసీఐ తనకు వంద శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించడంపై కోహ్లీ అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రత్యర్థులు రెచ్చగొడితేనే వారికి సమాధానం ఇచ్చినట్టు బీసీసీఐకు రాసిన లేఖలో కోహ్లీ పేర్కొన్నట్టు సమాచారం.
Updated Date - 2023-05-07T12:09:07+05:30 IST