Navratilova : క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడ్డా
ABN, First Publish Date - 2023-06-21T04:57:13+05:30
మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడింది. గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని మూడునెలల క్రితం మార్టినా ప్రకటించిన సంగతి
నవ్రతిలోవా
కాలిఫోర్నియా: మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడింది. గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని మూడునెలల క్రితం మార్టినా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న 66 ఏళ్ల మార్టినా.. ఆ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడినట్టు మంగళవారం తెలిపింది. చికిత్సలో భాగంగా 15 పౌండ్ల బరువు తగ్గానన్న నవ్రతిలోవా.. వ్యాధి నుంచి విముక్తి కలిగినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.
Updated Date - 2023-06-21T04:57:13+05:30 IST