ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

న్యూజిలాండ్‌ 55/5

ABN, First Publish Date - 2023-12-07T04:18:20+05:30

స్పిన్నర్లు విజృంభించడంతో.. న్యూజిలాండ్‌తో రెండో, ఆఖరి టెస్టు తొలి రోజు ఆతిథ్య బంగ్లాదేశ్‌ ఆధిక్యం ప్రదర్శించింది.

తిప్పేసిన హసన్‌, తైజుల్‌

బంగ్లా 172 ఆలౌట్‌

మిర్పూర్‌: స్పిన్నర్లు విజృంభించడంతో.. న్యూజిలాండ్‌తో రెండో, ఆఖరి టెస్టు తొలి రోజు ఆతిథ్య బంగ్లాదేశ్‌ ఆధిక్యం ప్రదర్శించింది. మొత్తంగా ఈ ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలగా.. స్నిన్నర్లే 13 వికెట్లు దక్కించుకొన్నారు. బుధవారం ఆరంభమైన టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 172 పరుగులకే కుప్పకూలింది. ముష్ఫికర్‌ (35), షహదత్‌ (31) టాప్‌ స్కోరర్లు. స్పిన్నర్లు శాంట్నర్‌ (3/65), ఫిలిప్స్‌ (3/31) చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఎజాజ్‌ పటేల్‌ (2/54) రెండు వికెట్లు తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ ఆట చివరకు 55/5 స్కోరు చేసింది. మిచెల్‌ (12), ఫిలిప్స్‌ (5) క్రీజులో ఉన్నారు. విలియ మ్సన్‌ (13), కాన్వే (11), బ్లండెల్‌ (0)ను మెహ్దీహసన్‌ (3/17) అవుట్‌ చేశాడు. తైజుల్‌ (2/29) రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, వెలుతురు లేమి కారణంగా 14 నిమిషాల ముందే ఆటను నిలిపివేశారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు కివీస్‌ ఇంకా 117 రన్స్‌ వెనుకంజలో ఉంది.

Updated Date - 2023-12-07T04:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising