ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eng vs NZ: సస్పెన్స్ థ్రిల్లర్ ని మరిపించేలా ఒక్క పరుగు తేడాతో కివీస్ గెలుపు

ABN, First Publish Date - 2023-02-28T11:18:35+05:30

న్యూజీలాండ్(New Zealand), ఇంగ్లాండ్ (England) మధ్య వెల్లింగ్టన్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ (#SecondTest) ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది క్రికెట్ ప్రేమికులు అందరికీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూజీలాండ్(New Zealand), ఇంగ్లాండ్ (England) మధ్య వెల్లింగ్టన్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ (#SecondTest) ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది క్రికెట్ ప్రేమికులు అందరికీ. ఐదో రోజు బాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ (#EnglandvsNewZealandCricket) విజయానికి 210 పరుగులు చేయాల్సి వుంది, చేతిలో తొమ్మిది వికెట్స్ వున్నాయి. ఇంగ్లాండ్ చాలా సునాయాసంగా ఈ టెస్ట్ గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు, ఎందుకంటే ఇంగ్లాండ్ ఇంతకు ముందు వరసగా నాలుగు టెస్టులు గెలిచినా విధానం చూసి. కానీ ఈ లక్ష్యాన్ని చేధించటంలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కొంచెం తడబడ్డారు. (#EnglandCricket)

పరుగుల మెషిన్ అని పిలవపడే హరీ బ్రూక్స్ (#Brooks) చాలా ఘోరంగా రన్ అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ 80 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయింది. అప్పుడే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ (Ben Strokes) వచ్చాడు, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ రూట్ (Joe Root) క్రీజులో వున్నాడు. ఇద్దరూ కలిపి 121 పరుగులు జోడించారు, ఆరో వికెట్ కి. న్యూజీలాండ్ కెప్టెన్ టిమ్ సౌతీ (#TimSouthee) వాగ్నెర్ (#Wagner) కి బౌలింగ్ ఇచ్చాడు. వాగ్నెర్ తన షార్ట్ పిచ్ బౌలింగ్ తో కాలుకి గాయంతో బాధపడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ ని అవుట్ చేసాడు. అప్పటికి ఇంగ్లాండ్ 57 పరుగుల లక్ష్యం సాధించాలి. జో రూట్ 95 పరుగులతో క్రీజులో వున్నాడు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ వచ్చాడు బాటింగ్ కి. కానీ జో రూట్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక, 95 పరుగులు చేసి వాగ్నెర్ కి అవుట్ అయ్యాడు.

ఇంక ఇంగ్లాండ్ టైలెండర్లు మీదే ఇంగ్లాండ్ ఆశ అంతా. స్టూవార్డ్ బ్రాడ్ (#StuartBroad), వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (#BenFoakes) క్రీజులో వున్నారు. బ్రాడ్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి స్కోర్ 215, ఇంకా 43 పరుగులు చెయ్యాలి. లీచ్ (#Leach) వచ్చాడు బాటింగ్ కి. అయితే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చాలా బాగా ఆడుతున్నాడు, కేవలం 7 పరుగుల లక్ష్యం వుంది అనగా ఒక రాంగ్ షాట్ కొట్టి 35 పరుగులకు అవుటయ్యాడు. ఇంకా ఇంగ్లాండ్ లాస్ట్ ఇద్దరు ఆండర్సన్ (#JimmyAnderson), లీచ్ వున్నారు. (#NewZealandCricket) అప్పుడే ఆండర్సన్ ఒక ఫోర్ కొట్టాడు. ఇంకా మూడు పరుగులు చెయ్యాలి. వాగ్నెర్ ఒక వైడ్ బాల్ ఇచ్చాడు. ఇంకా రెండు పరుగులు చేస్తే ఇంగ్లాండ్ చరిత్ర సృష్టిస్తుంది, కానీ వాగ్నెర్ లెగ్ సైడ్ వేసిన బంతిని ఆండర్సన్ కెలకడంతో అది బాట్ అంచుకి తాకి వికెట్ కీపర్ కి కాచ్ వెళ్ళింది. అంతే న్యూజీలాండ్ చరిత్ర సృష్టించింది. ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఐదో రోజు మ్యాచ్ మాత్రం ఒక థ్రిల్లర్ సినిమా చూసున్నామా అన్నంతగా తలపించింది. (EnglandvsNewZealandCricket)

ఇలా ఫాలో ఆన్ ఆడి విజయం సాధించిన వాటిలో న్యూజీలాండ్ విజయం క్రికెట్ హిస్టరీ లో నాలుగోది. ఈ విజయంతో న్యూజీలాండ్ సిరీస్ ని సమం చేసింది. మొదటి టెస్ట్ ఇంగ్లాండ్ గెలవగా, ఇప్పుడు రెండో టెస్ట్ న్యూజీలాండ్ ఒక్క పరుగుతో విజయం సాధించి సిరీస్ సమం చేసి చరిత్ర సృష్టించింది. (#EnglandCricket)

Updated Date - 2023-02-28T11:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!