Home » Ben Stokes
బాజ్‌బాల్ వ్యూహంతో టీమిండియాను కూడా ఓడించాలని భావించిన ఇంగ్లండ్ వ్యూహం అంతగా ఫలించడం లేదు. ఈ మధ్యకాలంలో తమకు ఎదురైన అన్ని జట్లను బాజ్‌బాల్ వ్యూహంతో దెబ్బతీస్తున్న ఇంగ్లండ్ ఆటలు టీమిండియా దగ్గర మాత్రం అంతగా సాగడం లేదు.
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్(England) ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. భారత్(India) చేతిలో ప్రత్యర్థి జట్టు ఏకంగా 434 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బజ్‌బాల్ క్రికెట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద పరాజయం.
వరల్డ్‌కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, ఇంగ్లండ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.
బెన్ స్టోక్స్ గతంలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్లో రాణించేందుకు వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.
2019 వన్డే ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ యూటర్న్ తీసుకున్నాడు. వన్డేలకు గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాడు. ఈ మేరకు బుధవారం నాడు 15 మంది సభ్యులతో ప్రొవిజనల్ జట్టును ఈసీబీ ప్రకటించింది. అయితే ఈసీబీ ప్రకటించిన జట్టులో గత ప్రపంచకప్‌లో రాణించిన పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు.
ఇప్పటివరకు టెస్టుల్లో 250 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఎక్కువ సార్లు ఛేదించిన టీమ్ కెప్టెన్‌గా రికార్డు ధోనీ పేరిట ఉంది. ధోనీ నేతృత్వంలో టీమిండియా నాలుగు సార్లు 250కి పైగా టార్గెట్లను ఛేదించి విజయాలు కైవసం చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాపై 251 పరుగుల టార్గెట్‌ను బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ అధిగమించి గెలిచింది. అయితే స్టో్క్స్ కెప్టెన్‌గా 250 రన్స్‌కు పైగా టార్గెట్లను ఛేదించడం ఇంగ్లండ్‌కు ఇది ఐదోసారి. దీంతో ధోనీ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ అధిగమించాడు.
ఆస్ట్రేలియా వార్తా పత్రిక ‘ది వెస్ట్రన్ ఆస్ట్రేలియా’.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను క్రై బేబిగా ఉద్దేశిస్తూ సోమవారం నాడు ఫోటోలను ప్రచురించింది. బెన్ స్టోక్స్ అండర్‌వేర్‌తో నోట్లో పాలపీక పెట్టుకున్న ఫొటోలతో వ్యంగ్యంగా ఒక కథనాన్ని ప్రచురించింది.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో (Ashes Series 2023) ఆస్ట్రేలియా(Australia) జోరు కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి జోష్‌లో ఉన్న ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. దీంతో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. 371 పరుగుల భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (155) అద్బుతంగా పోరాడినప్పటికీ ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో ఇంగ్లండ్‌కు(England) ఓటమి తప్పలేదు.
ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL
న్యూజీలాండ్(New Zealand), ఇంగ్లాండ్ (England) మధ్య వెల్లింగ్టన్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ (#SecondTest) ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది క్రికెట్ ప్రేమికులు అందరికీ.