RR vs SRH: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఫిలిప్స్.. 19వ ఓవర్‌లో అతడి విధ్వంసం ఎలా సాగిందంటే..
ABN, First Publish Date - 2023-05-08T12:34:17+05:30
ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సిన వినోదం అందించింది. అనేక మలుపులు తిరుగుతూ అభిమానుల అంచనాలకు అందకుండా సాగింది.
ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (SRHvsRR) మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సిన వినోదం అందించింది. అనేక మలుపులు తిరుగుతూ అభిమానుల అంచనాలకు అందకుండా సాగింది. చివరి బంతి వరకు ఫలితం ఇరు జట్లతోనూ దోబూచులాడింది. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్.. బట్లర్ (Jos Buttler) (95), సంజూ శాంసన్ (Sanju Samson) (66 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్ (33), అభిషేక్ తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అభిషేక్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే హైదరాబాద్‌ను రేసులోకి తీసుకొచ్చింది మాత్రం చివర్లో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు కావాల్సిన సమయంలో ఫిలిప్స్ చెలరేగాడు. 19వ ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్ 6,6,6,4 కొట్టడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఈ మ్యాచ్‌లో గ్లెన్ 7 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసి ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు.
SRHvsRR: సందీప్ శర్మ ఎంత పని చేశాడు? చివరి బంతికి హై డ్రామా.. ఏం జరిగిందో చూడండి..
ఆతర్వాత గ్లెన్ అవుటైనా అబ్దుల్ సమద్ (Abdul Samad) (17 నాటౌట్) పోరాడాడు. చివరి ఓవర్లో జట్టుకు అవసరమైన పరుగులు చేశాడు. చివరి ఓవర్ వేసిన రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ (Sandeep Sharma) తడబాటు కూడా సమద్‌కు కలిసి వచ్చింది. చివరి ఓవర్ చివరి బంతికి సందీప్ నో-బాల్ (No-Ball) వేయడం మ్యాచ్‌లో హైలెట్ ట్విస్ట్ ఇచ్చింది. గెలుపు సంబరాలు చేసుకుంటున్న రాజస్థాన్‌కు షాకిచ్చింది. ఫ్రీ-హిట్ బాల్‌కు సమద్ సిక్స్ కొట్టి చేజారిందనుకున్న మ్యాచ్‌ను గెలిపించాడు.
Updated Date - 2023-05-08T14:42:21+05:30 IST