Neeraj Chopra: నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసలు
ABN, First Publish Date - 2023-07-02T12:24:53+05:30
జావెలిన్ త్రో ప్లేయర్, భారత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా అసాధారణ ప్రతిభ చూపి విజేతగా నిలిచారని.. నీరజ్ ఎంతో ప్రతిభావంతుడు అని ప్రధాని కొనియాడారు. అంకితభావం కారణంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు.
జావెలిన్ త్రో (JAVELIN THROW) ప్లేయర్, భారత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా (NEERAJ CHOPRA) మరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. లుసానేలో జరిగిన డైమండ్ లీగ్ టోర్నమెంట్‌లో అతడు బల్లెంను 87.66 మీటర్ల దూరం విసిరి ఈ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ (NARENDRA MODI) ట్విట్టర్ వేదికగా నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా అసాధారణ ప్రతిభ చూపి విజేతగా నిలిచారని.. నీరజ్ ఎంతో ప్రతిభావంతుడు అని ప్రధాని కొనియాడారు. అంకితభావం కారణంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు.
ఇది కూడా చదవండి: చోప్రా చమక్
కాగా భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు ఇది వరుసగా రెండో డైమండ్ టైటిల్. దీనికి ముందుఈ యంగ్ ఛాంపియన్ దోహాలో తొలి టైటిల్ సాధించాడు. అతడు తన తొలి డైమండ్ లీగ్ టైటిల్‌ను గతేడాది ఆగస్టులో గెలుచుకున్నాడు. కాగా ఇటీవల వరల్డ్ అథ్లెటిక్స్ ర్యాంకుల్లో నీరజ్‌చోప్రా 1455 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అప్పటి వరకు 1433 పాయింట్లతో వరల్డ్ ఛాంపియన్‌గా ఉన్న గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్‌ను నీరజ్ చోప్రా (NEERAJ CHOPRA) వెనక్కి నెట్టాడు.
Updated Date - 2023-07-02T12:34:10+05:30 IST