ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Priya Malik: స్వర్ణ ప్రియ

ABN, First Publish Date - 2023-08-18T04:14:36+05:30

జూనియర్‌ రెజ్లింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ప్రియా మాలిక్‌ సర్ణంతో అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల 76 కిలోల ఫైనల్లో ప్రియ 5-0తో లారా సెవ్లీ (జర్మనీ)ని మట్టికరిపించింది.

ఫైనల్‌కు అంతిమ్‌, సవిత

జూనియర్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌

అమ్మాన్‌ (జోర్డాన్‌): జూనియర్‌ రెజ్లింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ప్రియా మాలిక్‌ సర్ణంతో అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల 76 కిలోల ఫైనల్లో ప్రియ 5-0తో లారా సెవ్లీ (జర్మనీ)ని మట్టికరిపించింది. భారత రెజ్లర్‌ ఉడుంపట్టుకు లారా ఒక్క పాయింట్‌ కూడా స్కోరు చేయలేక పోయింది. కాగా, ఈవెంట్‌ చరిత్రలో పసిడి నెగ్గిన రెండో భారత మహిళా రెజ్లర్‌గా ప్రియ నిలిచింది. గతేడాది అంతిమ్‌ పంఘాల్‌ ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇక, డిఫెండింగ్‌ చాంప్‌ అంతిమ్‌ పంఘాల్‌, సవిత, అంతిమ్‌ కుందూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 53 కిలోల విభాగం సెమీ్‌సలో అంతిమ్‌ పంఘాల్‌ 12-0తో పొలినా లుకినాపై గెలిచి టైటిల్‌ నిలబెట్టుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది. ఆసియాడ్‌ బెర్త్‌ విషయంలో వినేశ్‌ ఫొగట్‌పై కేసు వేసి అంతిమ్‌ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. 62 కిలోల సెమీ్‌సలో ఐరిస్‌ మతిల్డే (ఫ్రాన్స్‌)పై సవిత బైఫాల్‌ పద్ధతిలో నెగ్గి ఫైనల్‌కు చేరుకొంది. 65 కిలోల కేటగిరీలో అంతిమ్‌ కుండు 9-5తో ఎకతరీనా కోష్కినాపై గెలిచింది. కాగా, 72 కిలోల్లో హర్షిత 1-2తో బుకారెస్‌ సెర్ట్‌ (టర్కీ) చేతిలో ఓడి కాంస్యం కోసం తలపడనుంది.

Updated Date - 2023-08-18T04:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising