ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kolkata vs Punjab: చివరిలో చెలరేగిన పంజాబ్ కింగ్స్... కోల్‌కతా ముందు ఛాలెంజింగ్ టార్గెట్...

ABN, First Publish Date - 2023-05-08T21:42:54+05:30

కెప్టెన్ శిఖర్ ధావన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తోపాటు చివరిలో షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్ రాణించడంతో కోల్‌కతాపై మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Kolkata Knight Riders vs Punjab Kings) ఫర్వాలేదనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కెప్టెన్ శిఖర్ ధావన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తోపాటు చివరిలో షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్ రాణించడంతో కోల్‌కతాపై మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Kolkata Knight Riders vs Punjab Kings) ఫర్వాలేదనిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోల్‌కతా లక్ష్యంగా 180 పరుగులుగా ఉంది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ (57) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (12), శిఖర్ ధావన్ (57) చొప్పున పరుగులు చేయగా.. భానుక రాజపక్స (0), లియామ్ లివింగ్ స్టోన్ (15), జితేష్ శర్మ (21), సామ్ కరాన్ (4), రిషి ధావన్ (19), షారుఖ్ ఖాన్ (21 నాటౌట్), హర్‌ప్రీత్ బ్రార్ (17) చొప్పున పరుగులు చేశారు.

ఇక కోల్‌కతా బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీశారు. ఒక దశలో కట్టుదిట్టమైన బంతులతో స్కోరును నియంత్రించగలిగారు. అయినప్పటికీ చివరిలో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. వరుణ్ చక్రవర్తి అత్యధికంగా 3 వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా 2, సుయాష్ శర్మ, నితీష్ రాణా 1 చొప్పున వికెట్లు తీశారు.

Updated Date - 2023-05-08T21:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising