Rajasthan vs Gujarat: స్వల్ప స్కోరుకే కుప్పకూలిన రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే...
ABN, First Publish Date - 2023-05-05T21:31:08+05:30
ఐపీఎల్ 2023లో (IPL2023) మరో విజయాన్ని ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దిశగా దూసుకెళ్లాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ (Rajastan royals) బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో తడబట్టారు.
జైపూర్: ఐపీఎల్ 2023లో (IPL2023) మరో విజయాన్ని ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దిశగా దూసుకెళ్లాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ (Rajastan royals) బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో తడబడ్డారు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌పై (Gujarat titans) మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. 17.5 ఓవర్లలో కేవలం 118లకే కుప్పకూలింది. గుజరాత్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌లు విజృభించడంతో టాటా ఐపీఎల్ 2023లో రెండవ అత్యుల్ప స్కోరు నమోదయ్యింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ సంజూ శాంసన్ కొట్టిన 30 పరుగులే అత్యధికంగా ఉన్నాయి. మిగతావారిలో ఎవరి స్కోరూ 15 పరుగులు దాటలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్కరు కూడా డకౌట్ కాలేదు.
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో యశశ్వి జైస్వాల్ (14), జాస్ బట్లర్ (8), సంజూ శాంసన్ (30), దేవధూల్ పడిక్కల్ (12), రవిచంద్రన్ అశ్విన్ (2), రియాన్ పరాగ్ (4), షిమ్రోన్ హిట్మేయర్ (7), ధ్రువ్ జురెల్ (9), ట్రెండ్ బోల్ట్ (15), ఆడమ్ జంపా (7), సందీప్ శర్మ (2 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక గుజరాత్ బౌలర్లలో అత్యధికంగా రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత నూర్ అహ్మద్ 2, మహ్మద్ షమీ, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, జోషువా లిటిల్ తలో వికెట్ తీశారు. మిగతా రెండు వికెట్లు రనౌట్ రూపంలో గుజరాత్‌కు లభించాయి.
Updated Date - 2023-05-05T21:52:43+05:30 IST