ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rohit Sharma: ఫీల్డింగ్‌లో ముంబై ఘోర వైఫల్యం.. పియూష్‌ను మైదానంలోనే తిట్టేసిన రోహిత్ శర్మ!

ABN, First Publish Date - 2023-04-26T08:51:10+05:30

టీ-20 అంటే పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యంలో సాగే గేమ్. చాలా నిబంధనలు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటేనే బౌలర్లకు కొంతైనా ఉపశమనం కలుగుతుంది. వన్డే, టెస్ట్‌లతో పోల్చుకుంటే టీ-20ల్లో ఫీల్డింగ్ ఉత్తమంగా ఉండాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీ-20 అంటే పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యంలో సాగే గేమ్. చాలా నిబంధనలు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఫీల్డింగ్ (Fielding) మెరుగ్గా ఉంటేనే బౌలర్లకు కొంతైనా ఉపశమనం కలుగుతుంది. వన్డే, టెస్ట్‌లతో పోల్చుకుంటే టీ-20ల్లో ఫీల్డింగ్ ఉత్తమంగా ఉండాలి. లేకపోతే మ్యాచ్‌లు చేజారే ప్రమాదం ఉంది. మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో (GT) జరిగిన మ్యాచ్‌లో ముంబై (MI) ఫీల్డింగ్ చెత్తగా సాగింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

34 ఏళ్ల పియూష్ చావ్లా (Piyush Chawla) ఈ ఐపీఎల్‌లో (IPL 2023) ముంబైకు ప్రధాన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు కేవలం 7.11 ఎకానమీతో పరుగులు ఇస్తున్నాడు. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం కొంత తడబడుతున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కూడా పియూష్ 2/34తో మెరుగైన ప్రదర్శనే చేశాడు. అయితే ఫీల్డింగ్‌లో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 17వ ఓవర్లో మెరిడెత్ వేసిన నాలుగో బంతిని అభినవ్ థర్డ్ మేన్ దిశగా కొట్టాడు. కేవలం ఒక పరుగు మాత్రమే వస్తుందని బ్యాట్స్‌మెన్ కూడా అనుకున్నాడు.

David Warner: మ్యాచ్‌కు ముందు ఆసక్తికర ఘటన.. భువనేశ్వర్ కాళ్లకు దండం పెట్టిన వార్నర్.. వీడియో వైరల్!

థర్డ్ మేన్ స్థానంలో ఉన్న పియూష్‌ ఆ బంతిని సరిగ్గా పట్టుకోలేకపోవడంతో ఆ బంతి బౌండరీకి వెళ్లింది. అప్పటికే పరుగుల ప్రవాహం సాగుతుండడంతో రోహిత్ అసహనంతో ఉన్నాడు. పియూష్ మిస్ ఫీల్డ్ చేయడంతో ఆగ్రహం పట్టలేక మైదానంలోనే తిట్టేశాడు. రోహిత్ మాత్రమే కాదు.. బౌలర్ కూడా పియూష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-04-26T08:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising