ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rohit Sharma: రోహిత్ శర్మ రాత మారడం లేదు.. మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న ముంబై కెప్టెన్!

ABN, First Publish Date - 2023-05-10T12:13:12+05:30

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన ఐపీఎల్‌లోనూ కొనసాగుతోంది. ఐపీఎల్‌లో ముంబై జట్టును నడిపిస్తున్న రోహిత్ జట్టుకు భారంగా మారుతున్నాడు. నాయకుడిగా సఫలమవుతున్నా, ఆటగాడిగా మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) పేలవ బ్యాటింగ్ ప్రదర్శన ఐపీఎల్‌లోనూ (IPL 2023) కొనసాగుతోంది. ఐపీఎల్‌లో ముంబై జట్టును (MI) నడిపిస్తున్న రోహిత్ జట్టుకు భారంగా మారుతున్నాడు. నాయకుడిగా సఫలమవుతున్నా, ఆటగాడిగా మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. తాజాగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ (RCBvsMI) రోహిత్ నిరాశ పరిచాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 8 బంతుల్లో 7 పరుగులు చేసి హసరంగా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.

రోహిత్ గత ఐదు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌లకే పరిమితమయ్యాడు. రోహిత్ గత ఐదు మ్యాచ్‌ల్లోనూ వరుసగా 2,3,0,0,7 పరుగులు మాత్రమే చేశాడు. ఇంతకు ముందు కూడా ఇలాంటి రికార్డు రోహిత్ పేరు మీదే ఉంది. 2017 సీజన్‌లో కూడా రోహిత్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. తాజాగా తన రికార్డును తానే బద్దలుగొట్టుకున్నాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా కూడా రోహిత్ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

Virat vs Gambhir: విరాట్‌ను వదలరా? కోహ్లీ అవుట్.. సెలబ్రేట్ చేసుకున్న నవీనుల్, గంభీర్..!

ఈ సీజన్‌లో రోహిత్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 191 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకం ఉంది. కాగా, ఈ సీజన్‌లో రోహిత్ ప్రదర్శనపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. సెహ్వాగ్, రవిశాస్త్రి వంటి ఆటగాళ్లు రోహిత్ ఆటతీరును తప్పుపడుతున్నారు. రోహిత్ షాట్ సెలక్షన్ బాగోలేదని రవిశాస్త్రి (Ravi Shastri) అభిప్రాయపడ్డాడు. రోహిత్ మానసిక ఒత్తిడికి లోనవుతూ వికెట్ పారేసుకుంటున్నాడని సెహ్వాగ్ (Virender Sehwag) అన్నాడు.

Updated Date - 2023-05-10T12:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising