Kapil Dev: రోహిత్, విరాట్.. ఎన్ని దేశవాళీ మ్యాచ్‌లు ఆడారు?
ABN, First Publish Date - 2023-08-17T03:58:07+05:30
టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌లు ఆడకపోవడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌లు ఆడకపోవడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్లు రంజీ, హజారేలాంటి స్థానిక టోర్నీల్లో పాల్గొనాల్సిన అవసరముందన్నాడు. ‘దేశవాళీ క్రికెట్ చాలా ముఖ్యమైనది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు ఇటీవలి కాలంలో ఎన్ని దేశవాళీ మ్యాచ్‌లు ఆడారు? టాప్ క్రికెటర్లు దేశవాళీల్లో ఆడడం.. తర్వాతి తరం ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని కపిల్ అన్నాడు.
Updated Date - 2023-08-17T03:58:07+05:30 IST