ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasthan Vs Bangalore: రాజస్థాన్ ముందు ఆర్సీబీ మోస్తరు లక్ష్యం...

ABN, First Publish Date - 2023-05-14T17:25:48+05:30

ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన రాజస్థాన్ రాయల్స్‌పై (Rajastan royals) మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్‌‌కు భారీ టార్గెట్ నిర్దేశించడంలో విఫలమయ్యారు.

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ చెరో అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 171 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (55), గ్లేన్ మ్యాక్స్‌వెల్ (54) పరుగులతో ఇన్నింగ్స్ కీలకపాత్ర పోషించారు. చివరిలో అనుజ్ రావత్ 11 బంతుల్లో 29 పరుగులు కొట్టి ఫర్వాలేదనిపించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు ఆర్సీబీ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (18), మహిపాల్ లామ్రోర్ (1), దినేష్ కార్తీక్ (0), మిచెల్ బ్రేస్‌వెల్ (9 నాటౌట్), అనూజ్ రావత్ (29 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్లలో ఆడమ్ జంపా, కేఎం ఆసిఫ్ చెరో 2 వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు.

Updated Date - 2023-05-14T17:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising