ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shivam Dube: చెలరేగిన శివమ్ దూబే.. చిన్న స్వామి స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు..!

ABN, First Publish Date - 2023-04-18T09:35:57+05:30

ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే వంటి యువ భారత క్రికెటర్లు సంచలన ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత ఐపీఎల్ (IPL 2023) క్రికెట్ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. రింకూ సింగ్ (Rinku Singh), తిలక్ వర్మ (Tilak Varma), రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే (Shivam Dube) వంటి యువ భారత క్రికెటర్లు సంచలన ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. సోమవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ (RCB)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు శివమ్ దూబే ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించాడు. చిన్నస్వామి స్టేడియంలోని ప్రేక్షకులకు అసలైన ఎంటర్‌టైన్‌మెంట్ అందించాడు.

టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ 3 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కాన్వే, రహానే మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశారు. రహానే అవుటయ్యాక వచ్చిన శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 27 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. శివమ్ కొట్టిన సిక్స్‌లలో 101 మీ., 102మీ, 111 మీ. సిక్స్‌లు ఉన్నాయి. శివమ్‌తో పాటు కాన్వే (83) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగుల భారీ స్కోరు చేసింది.

Viral Video: బౌండరీ లైన్ వద్ద రహానే కళ్లు చెదిరే ఫీల్డింగ్.. సిక్స్‌ను ఎలా ఆపాడో చూడండి..!

భారీ లక్ష్య ఛేదనలోకి దిగిన బెంగళూరు పేలవంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు కోహ్లీ (6), మహిపాల్ (0) త్వరగా అవుట్ అయిపోవడంతో బెంగళూరు 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (76) అదిరిపోయే ఆటతో అలరించారు. వీరిద్దరూ బెంగళూరును సునాయాసంగా గెలిపించేస్తారు అనిపించారు. అయితే వీరిద్దరూ వెంట వెంటనే అవుట్ అయిపోవడంతో చెన్నై చివరకు 8 పరుగుల తేడాతో గట్టెక్కింది.

Updated Date - 2023-04-18T09:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising