ప్రపంచ జూనిర్ టెన్ని్‌సలో శౌర్యకు రజతం
ABN, First Publish Date - 2023-11-12T04:52:48+05:30
తెలంగాణకు చెందిన యువ టెన్నిస్ క్రీడాకారుడు శౌర్య సామల అంతర్జాతీయ టోర్నమెంట్‌లో మెరిశాడు...
హైదరాబాద్: తెలంగాణకు చెందిన యువ టెన్నిస్ క్రీడాకారుడు శౌర్య సామల అంతర్జాతీయ టోర్నమెంట్‌లో మెరిశాడు. ఆఫ్రికాలోని అంగోలాలో జరిగిన ప్రపంచ జూనియర్ టెన్నిస్ ఈవెంట్ సింగిల్స్‌లో రజత పతకం సాధించాడు. శనివారం జరిగిన అండర్-18 బాలుర సింగిల్స్ ఫైనల్లో శౌర్య 2-6, 4-6తో డానియల్ డొమినాగోస్ (అంగోలా) చేతిలో ఓటమిపాలై రజత పతకం అందుకున్నాడు. 15 ఏళ్ల శౌర్య తాను పోటీపడ్డ తొలి అంతర్జాతీయ టోర్నీలోనే సత్తా చాటడం విశేషం.
Updated Date - 2023-11-12T04:52:49+05:30 IST