Siraj No.1 : సిరాజ్.. మళ్లీ నెం.1
ABN, First Publish Date - 2023-09-21T04:09:39+05:30
గతవారం ఆసియా కప్ ఫైనల్లో సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రపీఠాన్ని అందుకున్నాడు. బుధవారం విడుదలైన ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో సిరాజ్ నెంబర్
వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
దుబాయ్: గతవారం ఆసియా కప్ ఫైనల్లో సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రపీఠాన్ని అందుకున్నాడు. బుధవారం విడుదలైన ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో సిరాజ్ నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి రెండోసారి టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో సిరాజ్ తొలిసారిగా నెంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఆసియా కప్‌లో శ్రీలంకతో ఫైనల్లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించిన సిరాజ్.. ఆ మ్యాచ్‌లో ఓవరాల్‌గా ఆరు వికెట్లతో (6/21) కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరచాడు. హాజెల్‌వుడ్ రెండు, బౌల్ట్ మూడు ర్యాంకుల్లో ఉన్నారు. ఇతర భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 9వ ర్యాంకులో నిలవగా.. బుమ్రా 27వ, హార్దిక్ పాండ్యా 50వ ర్యాంకులో ఉన్నారు. బ్యాటర్లలో గిల్, రోహిత్ శర్మ వరుసగా 2, 10వ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. కోహ్లీ ఓ స్థానం మెరుగై 8వ ర్యాంకులో నిలిచాడు. ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా 6వ ర్యాంక్‌కు చేరాడు.
Updated Date - 2023-09-21T04:10:46+05:30 IST