Sunil Gavaskar: బ్యాటర్లను ద్రవిడ్ సమర్థించడంపై సునీల్ గవాస్కర్ ఎమన్నారంటే..
ABN, First Publish Date - 2023-06-13T20:36:06+05:30
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC final) విఫలమైన టీం ఇండియా బ్యాటర్లను భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వెనకేసుకురావడంపై గవాస్కర్ (Sunil Gavaskar) మండిపడ్డారు. అత్యంత కీలకమైన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి విఫలమైందన్నారు. బౌలింగ్ యూనిట్, బ్యాటింగ్ యూనిట్‌లోనూ ఆటగాళ్లు ప్రభావం చూపలేకపోయారని గవాస్కర్ విమర్శించారు.
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC final) విఫలమైన టీం ఇండియా బ్యాటర్లను భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వెనకేసుకురావడంపై గవాస్కర్ (Sunil Gavaskar) మండిపడ్డారు. అత్యంత కీలకమైన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి విఫలమైందన్నారు. బౌలింగ్ యూనిట్, బ్యాటింగ్ యూనిట్‌లోనూ ఆటగాళ్లు ప్రభావం చూపలేకపోయారని గవాస్కర్ విమర్శించారు.
తన మాజీ సహచరులు సౌరవ్ గంగూలీ- హర్భజన్ సింగ్ నుంచి రాహుల్ ద్రవిడ్‌కు సంక్లిష్టమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొన్నేళ్లుగా భారత ఆటగాళ్ల సగటు పడిపోతుండడంపై ఏమంటారని ప్రశ్నించగా టీమిండియా ఆటగాళ్లను ద్రావిడ్ సమర్థించాడు. ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ పిచ్‌ల స్వరూపం మారుతోందని, ఫలితాలు వచ్చే విధంగా తయారయ్యాయని, ఈప్రభావం ఆటగాళ్ల సగటును తగ్గిస్తోందన్నాడు. ఇతర దేశాల ఆటగాళ్ల సగటు కూడా పడిపోతోందని వెనకేసుకొచ్చాడు.
రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ద్రావిడ్‌తో ఏకీభవించడంలేదన్నాడు. టీమిండియాలోని కొందరు దాదాలు (అన్నలు) విదేశాల్లో విఫలమవుతుంటారని విమర్శించాడు. ఇతర దేశాల ఆటగాళ్ల సగటుతో పనిలేదని, టీమిండియా బ్యాటర్ల సగటు గురించి మాట్లాడాలని ద్రావిడ్‌కు చురకలంటించాడు. స్వదేశంలో బాగా బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తారని, విదేశాల్లో కొంత మంది బ్యాటర్లు తడబడుతున్నారని గవాస్కర్ పేర్కొన్నాడు. టీం ఇండియా కోచింగ్ స్థాయిపై స్పందిస్తూ... గెలుపు, ఓటముల గురించి కాదని, ఓటమి యొక్క విధానం బాధిస్తుందన్నారు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీం ఇండియాపై 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-06-13T21:43:16+05:30 IST