Sunil Gavaskar: రోహిత్ శర్మ డిమాండ్‌పై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు
ABN, First Publish Date - 2023-06-13T17:58:57+05:30
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC final) ఫైనల్‌లో 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఉండాలన్న భారత (India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డిమాండ్‌పై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్: డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC final) ఫైనల్‌లో 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఉండాలన్న భారత (India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డిమాండ్‌పై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఘాటుగా స్పందించారు. అలాంటి సూచన చేసిన రోహిత్ శర్మపై గవాస్కర్ మండిపడ్డారు.
ప్రతి జట్టు ఇలాంటి పెద్ద ఈవెంట్లను ఆడే ముందు మానసికంగా సిద్ధంగా ఉండాలని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ చాలా కాలంగా నిర్ణయించబడిందని, తమరు తొలి మ్యాచ్‌లో ప్రవేశించడానికి ముందే ఫైనల్ ఒక్కసారి మాత్రమే జరుగుతుందని, తమరు మానసికంగా సిద్ధంగా ఉండాలని రోహిత్ శర్మకు గవాస్కర్ సూచించారు.
వచ్చే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడాలన్న రోహిత్ శర్మ సూచనను ఆస్ట్రేలియా (Australia) కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) కూడా తప్పుబట్టారు.
అయితే 444 పరుగుల ఛేదనలో 234 పరుగులకే టీం ఇండియా ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం ఓవల్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ 209 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ తాను డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 3-టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాలనుకుంటున్నానని చెప్పారు. తాము చాలా కష్టపడ్డామని, బాగా పోరాడామని, కానీ తాము కేవలం 1 గేమ్ ఆడినట్లు చెప్పారు. తదుపరి WTC ఫైనల్లో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఉంటుందని తాను భావిస్తున్నానని రోహిత్ శర్మ పేర్కొన్నారు.
Updated Date - 2023-06-13T18:11:32+05:30 IST