England Badminton : కఠిన పరీక్ష
ABN, First Publish Date - 2023-03-14T04:50:24+05:30
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో గతేడాది రన్నరప్ లక్ష్య సేన్‌కు ఆరంభంలోనే కఠిన పరీక్ష ఎదురుకానుంది. మంగళవారం తెరలేవనున్న మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి ..
నేటి నుంచి ‘ఆల్ ఇంగ్లండ్’ బ్యాడ్మింటన్
బరిలో సైనా, సింధు, లక్ష్యసేన్, శ్రీకాంత్
సాత్విక్ జోడీపై అంచనాలు
బర్మింగ్‌హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో గతేడాది రన్నరప్ లక్ష్య సేన్‌కు ఆరంభంలోనే కఠిన పరీక్ష ఎదురుకానుంది. మంగళవారం తెరలేవనున్న మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ చో టీన్ చెన్ (చైనీస్ తైపీ)తో సేన్ తలపడతాడు. వాంగ్ జు వి (చైనీస్ తైపీ)తో హెచ్‌ఎ్‌స ప్రణయ్, తోమ జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడనున్నారు. మహిళల సింగిల్స్‌లో సింధుకు మొదటి రౌండ్‌లోనే జాంగ్ యి మ్యాన్ (చైనా) రూపంలో గట్టిపోటీ ఎదురవనుంది. జాంగ్‌పై సింధు రికార్డు 1-1గా ఉంది. ఇటీవల టోర్నీల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న సింధు తొలి రౌండ్ దాటినా.. క్వార్టర్స్‌లో కఠిన ప్రత్యర్థి తై జు యింగ్‌ను ఓడించాల్సి ఉంటుంది. చైనా ప్లేయర్ హన్ యుతో వెటరన్ సైనా నెహ్వాల్ తలపడనుంది. డబుల్స్‌లో ఆరోసీడ్ సాత్విక్/ చిరాగ్ జోడీపై భారీ అంచనాలున్నాయి.
ఇండోనేసియా ద్వయం మార్క్‌స-కెవిన్ ఆఖరి నిమిషంలో పోటీనుంచి వైదొలగడంతో సాత్విక్ జంట తొలి ప్రత్యర్థి ఇంకా ఖరారవలేదు. మహిళల డబుల్స్‌లో గతే డాది సెమీఫైనలిస్ట్ ట్రీసా జాలీ-గాయత్రి పుల్లెల జంట అద్భుతం చేయాలన్న పట్టుదలతో ఉంది. మొదటి రౌండ్‌లో థాయ్‌లాండ్ జోడీ జాంగ్‌కోల్ఫన్-రవీండాతో గాయత్రి ద్వయం తలపడనుంది. 1980లో ప్రకాష్ పడుకోన్, 2001లో గోపీచంద్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క భారత షట్లర్ కూడా ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించలేదు. గతేడాది లక్ష్యసేన్ ఫైనల్ చేరినా.. విక్టర్ అక్సెల్‌సెన్ చేతిలో ఓడాడు. 2015లో సైనా రన్నర్‌పగా నిలవగా.. సింధు ఒక్కసారి కూడా సెమీస్ దాటలేదు.
Updated Date - 2023-03-14T04:50:24+05:30 IST