WTC Final: నాలుగో రోజు ముగిసిన ఆట.. ఆదుకున్న కోహ్లీ, రహానే.. స్కోర్ ఎంతంటే..
ABN, First Publish Date - 2023-06-10T22:45:26+05:30
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మూడో సెషన్‌లో వరుస వికెట్ల రూపంలో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది.
లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మూడో సెషన్‌లో వరుస వికెట్ల రూపంలో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. అయినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ, రహానే నిలకడగా ఆడి టీం ఇండియాను ఆదుకున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి భారత్ 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44, రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు విజయాన్ని చేరుకోవాలంటే ఇంకా 280 పరుగులు చేయాలి.
వరుసగా రెండు ఓవర్లలోనే రోహిత్ శర్మ, పుజారా ఔటయ్యారు. భారత్ 19.5 ఓవర్ వద్ద 2వ వికెట్, 20.4 ఓవర్ వద్ద 3వ వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 60 43 పరుగులు చేసి నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పుజారా 47 బంతుల్లో 27 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ కారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 7.1 ఓవర్లలో భారత్ 41 పరుగులు చేసి తొలి వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో 18 పరుగులు చేసిన శుభమాన్ గిల్ బోలాండ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రెండో సెషన్‌లో డిక్లేర్డ్ చేసిన ఆస్ట్రేలియా భారత్ ముందు 444 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270-8 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేయగా, తొలి ఇన్సింగ్స్‌లో టీం ఇండియా 296 పరుగులు చేసింది.
Updated Date - 2023-06-10T22:51:28+05:30 IST