ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yashasvi Jaiswal: ఐపీఎల్ చరిత్రలో పంత్ తర్వాత ఆ రికార్డు జైస్వాల్‌దే.. కోహ్లీ కూడా తర్వాతి స్థానంలోనే..

ABN, First Publish Date - 2023-05-20T09:49:22+05:30

ఐపీఎల్‌లో యంగ్‌స్టర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుని పలు రికార్డులను సొంతం చేసుకున్న జైస్వాల్.. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌లో (IPL 2023) యంగ్‌స్టర్, రాజస్థాన్ రాయల్స్ (RR) ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అదరగొడుతున్నాడు. తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుని పలు రికార్డులను సొంతం చేసుకున్న జైస్వాల్.. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో (PBKSvsRR) జైస్వాల్ అర్ధశతకం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ లీగ్‌లో జైస్వాల్ 600 పరుగుల మార్క్‌ను దాటాడు.

ఒక సీజన్‌లో ఆరు వందల పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ (టీమిండియాకు ఆడని ఆటగాడు)గా రికార్డు సృష్టించాడు. అలాగే ఓ సీజన్‌లో 600 ప్లస్ పరుగులు చేసిన పిన్న వయస్కులలో రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో పంత్ (Rishabh Pant) (20 ఏళ్ల 226 రోజులు), రెండో స్థానంలో జైస్వాల్ (21 ఏళ్ల 142 రోజులు), మూడో స్థానంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) (24 ఏళ్ల 193 రోజులు), నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ (24 ఏళ్ల 251 రోజులు) ఉన్నారు.

Naveen-ul-Haq: విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. నవీన్-ఉల్-హక్‌పై దారుణ ట్రోలింగ్.. వైరల్ అవుతున్న మీమ్స్!

ఇక, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లాడిన జైస్వాల్ 48 సగటుతో 625 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. స్ట్రైక్ రేట్ ఏకంగా 163 ఉండడ గమనార్హం. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో బెంగళూరు కెప్టెన్ డుప్లెసి (Faf du Plessis) (702) ఉన్నాడు.

Updated Date - 2023-05-20T09:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising