ప్రపంచ చాంప్‌కు షాకిచ్చినా..
ABN, First Publish Date - 2023-09-21T04:01:54+05:30
భారత యువ రెజ్లర్ అంతిమ్ ఫంగల్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేసినా ఫైనల్ చేరడంలో మాత్రం విఫలమైంది. బుధవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగంలో అంతిమ్
సెమీస్‌లో ఓడిన అంతిమ్
ప్రపంచ రెజ్లింగ్
బెల్‌గ్రేడ్ (సెర్బియా): భారత యువ రెజ్లర్ అంతిమ్ ఫంగల్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేసినా ఫైనల్ చేరడంలో మాత్రం విఫలమైంది. బుధవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగంలో అంతిమ్ సెమీఫైనల్లో ఓటమిపాలైంది. టోర్నీ ఆరంభ రౌండ్లోనే ప్రపంచ చాంపియన్ ఒలివియా పరిష్ (అమెరికా) రూపంలో కఠినమైన ప్రత్యర్థితో తలపడింది. ఒలివియాను 3-2తో చిత్తు చేసిన అంతిమ్.. ఆ తర్వాత ప్రీక్వార్టర్స్‌లో పోలెండ్ రెజ్లర్ రుక్సానాను టెక్నికల్ సుపీరియారిటీ పద్ధతిలో ఓడించింది. ఇక, క్వార్టర్‌ఫైనల్లో అంతిమ్ 9-6తో రష్యాకు చెందిన నటాలియా మలిషెవాపై గెలిచింది. కానీ, సెమీ్‌సలో 4-5తో వానెసా కలాజి న్స్‌కాయా (బెలారస్) చేతిలో పోరాడి ఓడింది. ఇక, మరో సెమీస్‌లో ఓడిన రెజ్లర్‌తో అంతిమ్ కాంస్య పతకం కోసం పోరాడనుంది.
Updated Date - 2023-09-21T04:01:54+05:30 IST