ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MS Dhoni Yuvaraj Singh: ధోనీ, నేను అంత మంచి స్నేహితులం కాదు: యువరాజ్ సింగ్

ABN, First Publish Date - 2023-11-05T12:27:11+05:30

ధోనీ, తాను అంత మంచి స్నేహితులం కాదని మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ అన్నాడు. టీమిండియాకి కలిసి ఆడాం కాబట్టి స్నేహితులమయ్యామని, మైదానం వెలుపల ఇద్దరి లైఫ్ స్టైల్స్ పూర్తి విభిన్నంగా ఉంటాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

ధోనీ, తాను అంత మంచి స్నేహితులం కాదని మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ అన్నాడు. టీమిండియాకి కలిసి ఆడాం కాబట్టి స్నేహితులమయ్యామని, మైదానం వెలుపల ఇద్దరి లైఫ్ స్టైల్స్ పూర్తి విభిన్నంగా ఉంటాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. మహి లైఫ్‌స్టైల్‌ తనకు చాలా భిన్నంగా ఉండేదని, అందుకే మంచి స్నేహితులంకాలేదని యువీ పేర్కొన్నాడు. అయితే మైదానంలో ఇద్దరం కలిసి భారత్‌కు 100 శాతానికిపైగా గెలుపు కోసం ఆడామని వివరించాడు. ధోనీ కెప్టెన్‌గా తాను వైస్ కెప్టెన్‌గా ఆడామని, కెప్టెన్-వైస్ కెప్టెన్ అయినప్పుడు నిర్ణయాల విషయాల్లో విరుద్ధ అభిప్రాయాలు ఉంటాయని పేర్కొన్నాడు. కొన్నిసార్లు ధోని తనకు నచ్చని నిర్ణయాలు తీసుకోగా.. ఇంకొన్నిసార్లు అతడు ఇష్టపడని నిర్ణయాలు తాను తీసుకున్నట్టు యువరాజ్ సింగ్ వివరించాడు. ప్రతి జట్టులో ఇది సర్వసాధారణమేనని పేర్కొన్నాడు.


తన కెరియర్ ముగింపు దశలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాలేదని, ఆ సమయంలో ఎంఎస్ ధోనీని సలహా అడిగానని యువరాజ్ వివరించాడు. సెలక్షన్ కమిటీ తనవైపు చూడటం లేదంటూ తనకు మొదట చెప్పిన వ్యక్తి ధోనీయేనని యువీ పేర్కొన్నాడు. 2019 ప్రపంచ కప్‌కి ముందు ఇది జరిగిందని, ఇదే వాస్తవమని యువరాజ్ తెలిపాడు. ‘టీఆర్ఎస్ క్లిప్స్’ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ మాట్లాడాడు.

Updated Date - 2023-11-05T12:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising