Alexa: భార్యకు తెలియకుండా భర్తకు దగ్గరైన అలెక్సా..తర్వాత ఏమైందంటే
ABN, Publish Date - Dec 30 , 2023 | 01:50 PM
టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో లేదా దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులతో ఏమవుతుందోనని అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇటివల ఓ టెక్నాలజీ పరికరం అలెక్సా ఏకంగా తన భార్యకు తెలియకుండానే ఆమె భర్తతో సంభాషించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఏదైనా కూడా ఎక్కువగా పరిమితికి మించి ఉపయోగిస్తే అది ముప్పెనని అనేక మంది చెబుతుంటారు. అది టెక్నాలజీ(technology) అయినా లేదా రోబో లాంటి ఇతర వస్తువులు అయినా కావచ్చు. ఇప్పటికే ఈ విషయాన్ని రోబో చిత్రంలో మనం చూడవచ్చు. అయితే ఇటివల ఓ టెక్నాలజీ పరికరం అమెజాన్ అలెక్సా వల్ల తన భర్తకు తనకు ఇబ్బందులు వస్తున్నాయని ఓ మహిళ తెలిపింది. అంతేకాదు ఆ క్రమంలో ఆమె దానిని ఇంటి నుంచి తొలగించినట్లు కూడా తెలిపింది. అయితే ఆ పరికరం ద్వారా తనకు ఎలాంటి పరిస్థితులు ఎధురయ్యాయి. ఎందుకు ఆ పరికరం ఇంటి నుంచి తొలగించింది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాలో ఉండే ఓ టిక్ టాకర్ జెస్ కొన్ని పనుల కారణంగా తన ఇంటినుంచి కొన్ని రోజులు వేరే ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో తన ఇంట్లో ఉన్న అలెక్సా(Alexa)ను ఆపేసి పోయింది. అయినప్పటికీ అర్ధరాత్రి సమయంలో అలెక్సా పరికరం ఫీమెల్ వాయిస్(voice) ద్వారా తన భర్తతో మాట్లాడినట్లు జెస్ తెలిపింది. తన భర్త తెల్లవారుజామున 1 గంటకు వీడియో గేమ్ ఆడుతున్న క్రమంలో సూపర్ అని సంభాషించినట్లు చెప్పింది. దీంతోపాటు పలుమార్లు మాట్లాడిందని ఆమె అన్నారు. అంతేకాదు జెస్ ఫ్యామిలీలో ఎవరు మాట్లాడకుండా ఉన్న సమయంలో కూడా అలెక్సా ఆకస్మాత్తుగా మాట్లాడుతున్నట్లు గుర్తించినట్లు ఆమె తెలిపింది. దీంతో ఆమె ఆ పరికరాన్ని తన ఇంటి నుంచి తొలగించినట్లు వెల్లడించింది.
Updated Date - Dec 30 , 2023 | 01:50 PM