5G Smartphones: రూ.20 వేల లోపు ధరతో మార్కెట్‌లో ఉన్న బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే!
ABN, First Publish Date - 2023-09-13T20:22:23+05:30
ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో 5G హవా సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నాయి. 5జీ నెట్‌వర్క్ ఇలా వచ్చిందో లేదో అప్పుడే 5జీ మొబైల్స్ మార్కెట్‌లోకి వచ్చేశాయి.
ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో 5G హవా సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నాయి. 5జీ నెట్‌వర్క్ ఇలా వచ్చిందో లేదో అప్పుడే 5జీ మొబైల్స్ మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఇప్పటికే దాదాపుగా 2జీ, 3జీ కనుమరుగవగా త్వరలోనే 4జీకి కూడా అదే పరిస్థితి రావొచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఫలితం కోసం ఒకప్పటిలా వేచి చూసే ఓపిక ప్రస్తుతం ఎవరికీ లేదు. ఈ రోజుల్లో సెర్చ్ బాక్స్‌లో ఇలా టైప్ చేశామా? మనకు కావాల్సింది వెంటనే ప్రత్యక్షం అయిందా? అలా ఉండాలి. అందుకే అత్యంత వేగంతో ఇంటర్నెట్ ఉండే మొబైల్స్ వైపే వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మెజారిటీ వ్యక్తులు 5జీ మొబైల్స్ కొనడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల 5జీ మొబైల్స్ ఉన్నాయి. దీంతో వీలైనంత తక్కువ రేటులో బెస్ట్ 5జీ మొబైల్స్ ఏదో అర్థం కాక వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులు ఇచ్చిన రివ్యూల ఆధారంగా రూ.20 వేల లోపు ధరతో ఉన్న టాప్ 5జీ మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Nord CE 2 Lite 5G
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ 5జీ మొబైల్ ఫోన్ 6GB RAM, 128GB Storageతో ఉంది. అమెజాన్‌లో లక్ష 34 వేలకుపైగా రేటింగ్స్ పొందిన ఈ మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. 64MP ప్రధాన కెమెరా ఉండగా.. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. డిస్‌ప్లే సైజ్ 6.59 ఇంచులుగా ఉంది. బ్యాటరీ కెపాసిటీ 5000 mAhగా ఉంది. ఇక ఈ మొబైల్ ఫోన్ ధర రూ.17,999గా ఉంది.
Samsung Galaxy M33 5G
8GB RAM, 128GB స్టోరేజ్ కల్గిన ఈ మొబైల్ ఫోన్‌కు అమెజాన్‌లో 32 వేలకుపైగా రేటింగ్స్ ఉన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికొస్తే Exynos 1280 ఆక్టా కోర్ 2.4GHz 5nm ప్రాసెసర్, ట్రూ 5G అనుభవం కోసం 12 బ్యాండ్ మద్దతు ఉంది. 16.72 సెంటి మీటర్ల సైజ్ గల డిస్‌ప్లే ఉంది. ప్రధాన కెమెరా 50MP + 2MP + 2MPగా ఉండగా.. ఫ్రంట్ కెమెరా 8MPగా ఉంది. బ్యాటరీ కెపాసిటీ 6000 mAh గా ఉంది. 128జీబీ గల ఇంటర్నల్ మెమోరీ స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ ధర రూ.17,999గా ఉంది.
Redmi Note 11T 5G
6GB RAM, 128GB ROM గల ఈ మొబైల్‌కు అమెజాన్‌లో 34 వేలకు పైగా రేటింగ్స్ ఉన్నాయి. 810 ఆక్టా కోర్ 5జీ ప్రాసెసర్ ఉంది. డిస్‌ప్లే సైజ్ 6.6 ఇంచ్‌లుగా ఉంది. 50MP హై రిసోల్యూషన్ ప్రైమరీ కెమెరా f/1.8తో 8MP ఆల్ట్రా వైడ్ సెన్సార్‌తో ఉంది. ఫ్రంట్ కెమెరా 16MPగా ఉంది. బ్యాటరీ కెపాసిటీ 5000mAhగా ఉంది. ఈ మొబైల్‌లో మొదటి రెండు నెలల్లో ఉచిత యూట్యూబ్ ప్రీమియం కూడా ఉంది. ఈ మొబైల్ ఫోన్ ధర రూ.18,499గా ఉంది.
Samsung Galaxy M13
6GB RAM, 128GB స్టోరేజ్ గల ఈ మొబైల్ ఫోన్‌కు అమెజాన్‌లో 26 వేలకు పైగా రేటింగ్స్ ఉన్నాయి. 12 GB RAM వరకు కూడా ఉంది. 128GB ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్‌ను 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. కెమెరా ఫీచర్ల విషయానికొస్తో 50MP+5MP+2MP గల ట్రిపుల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 8MPగా ఉంది. డిస్‌ప్లే సైజ్ 16.72గా ఉంది. ఇక ఈ మొబైల్ ఫోన్ ధర రూ.11,499గా ఉంది.
Updated Date - 2023-09-13T20:22:23+05:30 IST