Cognizant: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన కాగ్నిజెంట్.. వేలాది మంది తొలగింపు..?
ABN, First Publish Date - 2023-05-04T17:17:42+05:30
ప్రస్తుత కాలంలో కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు (Software companies) తమ ఉద్యోగులకు (Employees) షాక్ ఇస్తున్నాయి.
హైదరాబాద్: ప్రస్తుత కాలంలో కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు (Software companies) తమ ఉద్యోగులకు (Employees) షాక్ ఇస్తున్నాయి. సంస్థల వ్యయాలను తగ్గించుకునేందుకు వేలాది మంది ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తున్నాయి. ప్రముఖ టెక్ సంస్థలు అదనపు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) కూడా ఇదే బాట పట్టింది.
కంపెనీ వ్యయాలను తగ్గించుకునేందుకు వెనుకాడకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. సంస్థ ఖర్చును ఆదా చేసేందుకు 3,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని, ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇవ్వనున్నట్లు టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ పేర్కొంది. 2023లో తమ ఆదాయం తగ్గుతుందని కాగ్నిజెంట్ వెల్లడించింది. మరికొన్ని కార్యాలయాలను మూసివేస్తున్నట్లు కంపెనీ సీఈఓ రవికుమార్ ఎస్ తెలియజేశారని మనీకంట్రోల్ తన రిపోర్టులో పేర్కొంది. కంపెనీ మార్జిన్లు పరిశ్రమలో అత్యల్పంగా 14.6 శాతంగా ఉన్నాయని మనీకంట్రోల్ నివేదిక (Moneycontrol report) పేర్కొంది.
టెక్ పరిశ్రమలో తొలగింపులు ఇలా ఉన్నాయి.
ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడం టెక్ కంపెనీ కాగ్నిజెంట్ మాత్రమే కాదని, గత రెండు నెలల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు విప్రో, అమెజాన్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఐబీఎం, గూగుల్, మెటా, ట్వీట్టర్ సంస్థతోపాటు మరికొన్ని కంపెనీలు కూడా ప్రకటించాయని మనీకంట్రోల్ తన రిపోర్టులో పేర్కొంది. టెక్ రంగం గడ్డుకాలంలో వెళుతోందని, ఉద్యోగులను తొలగించిన అనంతరం వేలాది మంది ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉద్యోగాల కోసం చాలా గట్టి పోటీ ఉందని తన నివేదికలో స్పష్టం చేసింది.
Updated Date - 2023-05-04T17:27:28+05:30 IST