ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Samsung Mobile Phones: శామ్‌సంగ్ యూజర్లకు హై అలర్ట్.. కేంద్రం చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే..

ABN, Publish Date - Dec 15 , 2023 | 05:50 PM

మీరు శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లను వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ ఫోన్లపై హ్యాకర్లు కన్నేసి ఉంచవచ్చు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోండి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.

మీరు శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లను వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ ఫోన్లపై హ్యాకర్లు కన్నేసి ఉంచవచ్చు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోండి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. లక్షలాది శామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోన్‌ల సెక్యూరిటీకి భంగం వాటిల్లే ప్రమాదముందని అప్రమత్తం చేసింది. తాజాగా ఈ హై-రిస్క్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

శామ్‌సంగ్ గెలాక్సీ వినియోగదారులందరూ వెంటనే తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ 11,12,13,14 వర్షన్స్‌ మొబైల్స్‌కి ఈ సమస్య ఉందని వెల్లడించింది. శామ్‌సంగ్ మొబైల్స్ సెక్యూరిటీ విభాగంలో చాలా లోపాలున్నాయని, వాటిని అలాగే వదిలేస్తే సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని హ్యాకర్లు చాలా సులువుగా సైబర్ దాడికి పాల్పడే ప్రమాదముందని హెచ్చరించింది. ఆయా మొబైల్స్‌లో స్పెషల్ కోడ్స్‌ ద్వారా మొబైల్‌ను హ్యాకర్లు సులభంగా తమ ఆధీనంలోకి తీసుకోగలరని, ఫోన్‌లోని మొత్తం సమచారాన్ని తస్కరించగలరని తెలిపింది.

గెలాక్సీ ఫోన్లలోని నాక్స్ (Knox) ఫీచర్లపై నియంత్రణ కోల్పోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, AR ఎమోజీ యాప్‌ సమస్యలు వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని భద్రతా ఏజెన్సీ తెలిపింది. ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడానికి శామ్‌సంగ్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ 11 వెర్షన్ లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్లతో రన్ అవుతున్న శామ్‌సంగ్ ఫోన్లను వాడుతున్నవారు వెంటనే అప్‌డేట్ కోసం చెక్ చేసుకోవాలి. లేకపోతే మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

Updated Date - Dec 15 , 2023 | 05:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising