Instagram Feature: సరికొత్త ఫీచర్‌ని తీసుకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. ఇకపై పబ్లిక్ అకౌంట్స్ నుంచి రీల్స్ డౌన్‌లోడ్
ABN, First Publish Date - 2023-11-23T17:01:53+05:30
తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను.. మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రకరకాల మార్పులతో పాటు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇకపై పబ్లిక్ అకౌంట్స్ నుంచి ఎవరైనా..
Instagram Reels Download: తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను.. మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రకరకాల మార్పులతో పాటు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇకపై పబ్లిక్ అకౌంట్స్ నుంచి ఎవరైనా రీల్స్‌ని షేర్, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తొలుత ఈ ఫీచర్‌ని అమెరికాలో జులై నెలలో తీసుకొచ్చింది. ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ప్రైవేట్ అకౌంట్ నుంచి రీల్స్ డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం లేదు కానీ, పబ్లిక్ అకౌంట్స్ నుంచి మాత్రం నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే.. డౌన్‌లోడ్ చేయబడిన రీల్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ వాటర్‌మార్క్, యూజర్‌నేమ్‌తో పాటు ఆడియో ఆట్రిబ్యూషన్ ఉంటాయి. అంతేకాదు.. ఆ రీల్స్‌ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించలేరు. అంతా బాగానే ఉంది కానీ.. రీల్స్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత వ్యక్తులు వాటిని ఎలా వాడుకుంటారో? ఏం చేస్తారో? అనేది నియంత్రించలేమని ఇన్‌స్టాగ్రామ్ స్పష్టం చేసింది. అంటే.. తమ రీల్స్‌ని అపరచితులు డౌన్‌లోడ్ చేసుకోవాలా? వద్దా? అనే ఆప్షన్‌ని యూజర్లకే వదిలేసింది. రీల్ అప్‌లోడ్ చేస్తున్నప్పుడు అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ ఉంచింది. అలాగే.. ప్రైవసీ సెట్టింగ్స్‌లో కూడా ఈ సదుపాయం ఉంది. అక్కడ తమకు తగినట్టు సెట్టింగ్స్ ఛేంజ్ చేసుకొని.. రీల్స్ డౌన్‌లోడ్ ఆప్షన్ పెట్టాలా? వద్దా? అనేది యూజర్లు నిర్ణయించుకోవచ్చు.
ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కొత్త ఫీచర్ ఉండేది కాదు. ఒకవేళ ఫోటోలు లేదా రీల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. థర్ట్ పార్టీ యాప్స్ లేదా ఇతర వెబ్‌సైట్లలో లింక్ పోస్టుకొని డౌన్‌లోడ్ చేసేవారు. ఇప్పుడు అలాంటి కష్టం లేకుండా, నేరుగా ఇన్‌స్టా నుంచే డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది. అయితే.. పబ్లిక్ ఖాతాలు కలిగిన 18 ఏళ్లలోపు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం మాత్రం.. రీల్స్ డౌన్‌లోడ్ చేయడానికి డిఫాల్ట్ సెట్టింగ్ ఆఫ్ చేయబడుతుంది. కావాలంటే దాన్ని ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఇలా స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి
* ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ని ఓపెన్ చేయాలి.
* పైభాగంలోని కుడివైపున ఉన్న మోర్ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత సెట్టింగ్స్ & ప్రైవసీపై ట్యాప్ చేయాలి.
* ప్రైవసీని ట్యాప్ చేసి.. రీల్స్ అండ్ రీమిక్స్‌పై క్లిక్ చేయాలి.
* టాగిల్ ఆఫ్ లేదా రీల్స్ డౌన్‌లోడ్ చేసే అనుమతిపై టాప్ చేయాలి.
Updated Date - 2023-11-23T17:01:55+05:30 IST