ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

iPhone13: ఇండియాలో భారీగా తగ్గిన ఐఫోన్ 13 ధర.. ఎవరూ ఊహించని విధంగా...

ABN, First Publish Date - 2023-06-10T13:05:25+05:30

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై ప్రస్తుతం ఐఫోన్ 13 భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రారంభ ధర రూ.58,749తో 5జీ ఐఫోన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Credit card) ఉన్నవారైతే ఈ ఫోన్‌ను రూ.57,999లకే దక్కించుకునే అవకాశం ఉంది. అదనంగా ఫోన్ ఎక్సేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కు (iPhone) ఉండే క్రేజ్ వేరే లెవల్. కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తే గంటలపాటు క్యూలైన్లలో నిరీక్షించి మరీ కొనుగోలు చేసిన ఔత్సాహిక ఐఫోన్ లవర్స్ ఎందరో ఉన్నారు. ఇంతటి ఆదరణ ఉన్నప్పటికీ ఈ ఫోన్ల రేట్లు సామాన్యులకు కాస్త భారంగానే అనిపిస్తాయి. అందుకే చక్కటి డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నప్పుడు చాలామంది ఐఫోన్లు కొనుగోలుకు మొగ్గుచూపుతుంటారు. ఈ విధంగా ఐఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. ఎందుకంటే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై (Flipkart) ప్రస్తుతం ఐఫోన్ 13 (iPhone13) భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రారంభ ధర రూ.58,749తో 5జీ ఐఫోన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Credit card) ఉన్నవారైతే ఈ ఫోన్‌ను రూ.57,999లకే దక్కించుకునే అవకాశం ఉంది. అదనంగా ఫోన్ ఎక్సేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.

పూర్తి వివరాలు ఇవే..

128జీబీ మోడల్ ఐఫోన్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌పై ఆరంభ ధర రూ.58,749కి అందుబాటులో ఉంది. ఇక యాపిల్ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌పై ఈ ఫోన్ రేటు రూ.69,900గా ఉంది. అంటే కస్టమర్లకు ఏకంగా రూ.11,151 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే డిస్కౌంట్‌పై షరతులు వర్తిస్తాయనే విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కలిగివున్న కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌పై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ (రూ.750) పొందొచ్చు. అంటే రూ.57,999లకే పొందొచ్చన్నమాట. అదనంగా ఎక్సేంజ్ ఆఫర్‌తో రూ.30,000 వరకు డిస్కౌంట్ దక్కించుకోవచ్చు. అయితే ఎక్సేంజ్ ఆఫర్‌లో ఫోన్ కండీషన్, కొనుగోలు చేసి ఎంతకాలం అయ్యిందనే అంశాల ఆధారంగా డిస్కౌంట్ ఎంతనేది నిర్ణయించబడుతుంది. కాగా ఈ డిస్కౌంట్ ఆఫర్ పరిమితకాలపు ఆఫరా లేక ఎక్కువకాలం అందుబాటులో ఉంటుందా అనేది తెలియరాలేదు.

మరి మార్కెట్లో ఐఫోన్ 14 అందుబాటులో ఉండగా ఐఫోన్ 13 కొనాలా? అంటే ప్రస్తుతం డిస్కౌంట్ ఆఫర్‌కు కొనుగోలు చేయడంలో నష్టమేమీ లేదు. ఎందుకంటే ఐఫోన్ 14 ప్రస్తుతం భారత్‌లో రూ.65,000లకు పలుకుతోంది. ఐఫోన్ 14లో ఉన్న ఫీచర్లన్నీ ఐఫోన్13లో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత డిస్కౌంట్ ధరలో ఐఫోన్ 13 కొనడంలో ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-06-10T13:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising