Nokia: నోకియా కొత్త ఫోన్స్ వచ్చేశాయ్.. ఫీచర్స్ ఇవే..
ABN, First Publish Date - 2023-05-09T17:40:39+05:30
ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ నోకియా (Nokia) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
హైదరాబాద్: ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ నోకియా (Nokia) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా భారత మార్కెట్లో (Indian market) నోకియా సీ22 సిరీస్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు నోకియా లైసెన్స్ పొందిన హెచ్ఎండీ గ్లోబల్ (HMD Global) సంస్థ పేర్కొంది. ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో ఫిబ్రవరి నెలలో C-సిరీస్ ఫోన్లను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. 6.5 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, డ్యుయల్ రియర్ కెమెరా 13 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగిన ఫీచర్లతో నోకియా సీ32, నోకియా సీ-22 స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్ 13తో పని చేయనున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే మూడు రోజులపాటు బ్యాటరీ పని చేస్తోంది. నోకియా సీ22 ఫోన్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 బిల్డ్‌ను కలిగి ఉంది. 2జీబీ ర్యామ్ నోకియా సీ22 ఫోన్ రూ. 9,500 ఉంటుంది.
నోకియా సీ22 ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
డ్యూయల్ సిమ్ ఉన్న నోకియా సీ22 ఫోన్ ఆండ్రాయిడ్ 13తో పని చేయనుంది. 6.5 అంగుళాల హెచ్ డీ (720x1,600 pixels) ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్, మాక్రో లెన్స్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 64జీబీ ఇన్ బుల్డ్ స్టోరేజ్, 256 మైక్రోఎస్డీ కార్డ్, ఫ్రింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ లాక్ ఫీచర్స్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ చార్జింగ్, ఐపీ22 రేటింగ్ ఉంటుంది.
Updated Date - 2023-05-09T17:44:42+05:30 IST