OnePlus 12 : త్వరలో భారత మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 12 మొబైల్.. ధర ఎంతంటే..?
ABN, Publish Date - Dec 24 , 2023 | 06:08 PM
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వన్ ప్లస్ మొబైల్‌కు మంచి డిమాండ్ ఉంది. వన్ ప్లస్ మొబైల్స్ కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వన్ ప్లస్ కంపెనీ కూడా తమ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికిప్పుడు కొత్త వేరియంట్‌ల మొబైల్స్‌తో, కొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్‌లోకి వస్తోంది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వన్ ప్లస్ మొబైల్‌కు మంచి డిమాండ్ ఉంది. వన్ ప్లస్ మొబైల్స్ కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వన్ ప్లస్ కంపెనీ కూడా తమ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికిప్పుడు కొత్త వేరియంట్‌ల మొబైల్స్‌తో, కొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్‌లోకి వస్తోంది. ఈ క్రమంలో సదరు మొబైల్ కంపెనీ చివరగా వన్ ప్లస్ 11ను విడుదల చేసింది. తాజాగా వన్ ప్లస్ 12ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌ను ఈ నెలలోనే చైనాలో ప్రారంభించారు. డిసెంబర్ 5న వన్ ప్లస్ 12 మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకుచ్చారు. ఇక భారత మార్కెట్‌లోకి వచ్చే నెల 23న తీసుకురానున్నారు. అదే రోజు ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో టాప్‌లో ఉన్న యాపిల్, శాంసంగ్, ఐక్యూకు వన్ ప్లస్ సవాల్ విసురుతోంది.
వన్ ప్లస్ 12 ఫీచర్ల విషయానికొస్తే స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ 3 ప్రాసెసర్, 4వ జనరేషన్ హాసెల్‌బ్లాడ్ కెమెరా సిస్టమ్, 4,600 నిట్స్ ప్రకాశవంతమైన ఆమోల్‌డ్ స్క్రీన్ ఉన్నాయి. 100 వోల్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తోపాటు 50 వోల్ట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. వీటితోపాటు మరిన్ని అదిరిపోయే ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో వన్ ప్లస్ 12 నాలుగు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 12GB + 256GB(రామ్+స్టోరేజ్), 16GB + 512GB, 16GB + 1TB, 24GB + 1TBలుగా ఉన్నాయి. వీటి ధరల విషయానికొస్తే ప్రస్తుతం చైనా మార్కెట్‌లో 12GB + 256GB ధర చైనా కరెన్సీ ప్రకారం సీఎన్‌వై(CNY). 4,299గా ఉంది. ఇది భారత కరెన్సీలో రూ.51,447గా ఉంటుంది. 16GB + 512GB ధర చైనా మార్కెట్‌లో CNY 5,299గా ఉంది. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.67,447గా ఉంది. 16GB + 1TB ధర చైనా మార్కెట్‌లో CNY 5,299గా ఉండగా భారత కరెన్సీలో దీని విలువ రూ.63,414గా.. 24GB + 1TB ధర చైనా మార్కెట్‌లో CNY 5,799 కాగా భారత మార్కెట్‌లో దీని విలువ రూ.69,398గా ఉంది.
అయితే ఈ ధరలు ప్రస్తుతం చైనా మార్కెట్‌లో ఉన్న దాని ప్రకారం మాత్రమే. అంటే భారత మార్కెట్‌లో వీటి ధరల్లో తేడాలు ఉండే అవకాశాలున్నాయి. వన్ ప్లస్ 12 బేస్ ధర 12GB + 256GB వేరియంట్‌కు రూ. 59,999 నుంచి రూ. 62,999 మధ్యలో ఉండొచ్చు. అలాగే 16GB + 512GB వెర్షన్ ధర రూ. 64,999 నుంచి రూ. 67,999 మధ్య ఉంటుందని సమాచారం. వన్ ప్లేస్ 11తో పోలిస్తే వీటి ధరలు 5 నుంచి 10 శాతం అధికంగానే ఉన్నాయి. ఒక వేళ తమ ప్రీమియం పొజిషనింగ్‌ను పటిష్టం చేయాలనుకుంటే మరో 10 నుంచి 15 శాతం పెరగొచ్చు. అప్పుడు వన్ ప్లస్ ప్రారంభ ధరనే రూ.64,999 నుంచి రూ.67,999 వరకు ఉంటుంది. అప్పుడు ఐఫోన్ 15 ధరలకు ఇవి దగ్గరగా చేరుకుంటాయి. అయితే వన్ ప్లస్ కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు కచ్చితమైన ధరలపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.
Updated Date - Dec 24 , 2023 | 06:15 PM