ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

OnePlus: కొత్త ఫీచర్లతో 40 అంగుళాల OnePlus స్మార్ట్ టీవీ.. ఆఫర్స్ ఇవే..

ABN, First Publish Date - 2023-04-14T16:49:22+05:30

చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్ సంస్థ వన్ ప్లస్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్ సంస్థ వన్ ప్లస్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా భారత (India) మార్కెట్లో శుక్రవారం కొత్త మోడల్ లో వన్ ప్లస్ టీవీ (OnePlus TV) 40 వై1ఎస్ స్మార్ట్ టీవీని (smart TV) ప్రవేశపెట్టింది. ఆసక్తి గల వినియోగదారులు వన్ ప్లస్.ఇన్., అమెజాన్.ఇన్., ఫ్లిప్ కార్ట్.ఇన్ వెబ్ సైట్ ద్వారా వన్ ప్లస్ టీవీ 40 వై1ఎస్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. భారత మార్కెట్లో ఉన్న వన్ ప్లస్ అధికారిక రిటైల్ స్టోర్లలో కూడా స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. వన్ ప్లస్ టీవీ 40 వై1ఎస్ స్మార్ట్ టీవీ రూ. 21,999, ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ కార్డు, ఈఎంఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కొత్త వన్ ప్లస్ టీవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు తక్షణ బ్యాంకు డిస్కౌంట్ రూ. 1500 లభిస్తోందని కంపెనీ తెలిపింది.

వన్ ప్లస్ టీవీ 40 వై1ఎస్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

అడ్వాన్స్ గామా ఇంజిన్ ఫీచర్ రియల్ టైమ్ అప్టిమైజేషన్ ఇమేజ్ క్వాలిటీ, అల్ట్రా క్లియర్ కంటెంట్, హెచ్ డీ డిస్ ప్లేతోపాటు హెచ్ డీఆర్10 సపోర్టు, 20డబ్ల్యూ స్పీకర్స్, డాల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పని చేయనుంది. వన్ ప్లస్ బడ్స్ ద్వారా వన్ ప్లస్ టీవీని చూడవచ్చు. యూజర్స్ స్మార్ట్ ఫోన్ తో వన్ ప్లస్ టీవీ 40 వై1ఎస్ స్మార్ట్ టీవీని కనెక్ట్ చేసుకొవచ్చు. ఇటీవల భారత మార్కెట్లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్, నార్డ్ సీఈ 3 లైట్ ను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 19,999, ఆండ్రాయిండ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పని చేస్తోంది.

Updated Date - 2023-04-14T16:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising