ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Realme 10: రియల్‌మీ 10 ఫోన్ విడుదల.. ధర ఎంతో తెలుసా..?

ABN, First Publish Date - 2023-01-09T21:01:11+05:30

భారత్‌లో రియల్‌మీ 10 4జీ (Realme 10 4G) ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ల (SmartPhones) తయారీ దిగ్గజం రియల్‌మీ (Realme) విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ 5జీ కాదు.. 4జీ కనెక్టివిటీతో కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో రియల్‌మీ 10 4జీ (Realme 10 4G) ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ల (SmartPhones) తయారీ దిగ్గజం రియల్‌మీ (Realme) విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ 5జీ కాదు.. 4జీ కనెక్టివిటీతో కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోన్ వెనుకవైపు మూడు సెన్సార్లకు బదులు డుయెల్ కెమెరా, మీడియాటెక్ జీ99 చిప్‌సెట్, 33వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తోంది.

రియల్‌మీ 10జీ ఫీచర్లు ఇవే..

కొత్త రియల్‌మీ 10 4జీ ఫోన్.. రియల్‌మీ 10 ప్రో మాదిరిగానే ఉంది. క్లాష్ వైట్, రష్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. అయితే ప్రో మోడల్ మాదిరిగా కాకుండా ఎక్స్‌ట్రా బ్లూ టోన్‌లో కనిపిస్తోంది. సింగిల్ స్పీకర్ చాంపర్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఛార్జింగ్ కోసం టైప్-సీ ఛార్జింగ్‌ ఉన్నాయి. 360 హెర్జ్ టచ్ రెస్పాన్స్ రేటుతో 90హెచ్‌జెడ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఫుల్-హెచ్‌డీ+ రిజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.

ధర ఎంతంటే..

భారత్‌లో రియల్‌మీ 10 4జీ (Realme 10) బేస్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ స్టోరేజీ మోడల్ ధర రూ.13,999 నుంచి ఆరంభమవుతుంది. ఇక 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ మోడల్ రేటు రూ.16,999గా ఉంది. రియల్‌మీ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ముందుగా త్వరపడే కస్టమర్లు రూ.12,999, రూ.15,999లకే ఫోన్లను దక్కించుకోవచ్చు. జనవరి 15న(మిడ్‌నైట్) ఫ్లిప్‌కార్ట్, రెయల్‌మీ అఫీషియల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ సేల్ ప్రారంభం కానుంది. కాగా గతేడాది చివరిలో రియల్‌మీ 10 4జీతోపాటు రియల్‌మీ 10 ప్రో (Realme Pro), రియల్‌మీ 10 ప్రో ప్లస్ (Realme Pro Plus) ఫోన్లను రియల్‌మీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి కంపెనీ షియోమీ (Xiaomi) భారత్‌లో రెడ్‌మీ నోట్ 12 5జీ సిరీస్ (Redmi Note 12 series) ఫోన్లను విడుదల చేసిన రోజుల వ్యవధిలో రియల్‌మీ రంగంలోకి దిగడం గమనార్హం.

Updated Date - 2023-01-09T21:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising