ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Reliance Jio: రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ వచ్చేశాయి.. రూ.2,999తో రిచార్జ్ చేసుకుంటే..

ABN, First Publish Date - 2023-08-10T18:20:15+05:30

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో(Reliance Jio) స్వాతంత్ర్య దినోత్సవం( Independence Offer) సందర్భంగా తమ వినియోగదారుల కోసం ప్రిపెయిడ్ ప్లాన్(prepaid plan) ఆఫర్‌లను ప్రకటించింది.

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో(Reliance Jio) స్వాతంత్ర్య దినోత్సవం( Independence Offer) సందర్భంగా తమ వినియోగదారుల కోసం ప్రిపెయిడ్ ప్లాన్(prepaid plan) ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.2,999 వెచ్చించి రిచార్జ్ చేసుకుంటే సంవత్సరం మొత్తం అంటే 365 రోజులు ఎలాంటి దిగులు లేకుండా జియో సిమ్‌ను(Jio Sim) వాడేసుకోవచ్చు. అపరిమిత కాల్స్(unlimited voice calling), ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు(SMS), ప్రతి రోజూ 2.5GB డేటా పొందవచ్చు. అంటే సంవత్సరం మొత్తానికి కలిపి 912GB డేటాను పొందవచ్చు. అంతేకాకుండా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాప్‌లను(JioCinema, JioTV, and JioCloud) ఏడాది పాటు ఉచితంగా వీక్షించవచ్చు. వీటితోపాటు రూ.5,800 విలువైన కూపన్లను పొందవచ్చు. ఈ కూపన్లను ఉపయోగించి పుడ్ డెలివరీ, ట్రావెల్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాటిపై తగ్గింపులను కూడా పొందవచ్చు.


ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో(Swiggy) రూ.240 కంటే ఎక్కువ ధర వెచ్చించి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ.100 డిస్కౌంట్ పొందొచ్చు. యాత్ర(Yatra) ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకుంటే రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హోటళ్లలో రూ.4 వేలకు మించి ఖర్చు చేస్తే 15 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇక అజియో(Ajio), నెట్‌మెడ్స్(Netmeds) ద్వారా రూ.999కి మించి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రిలయన్స్ డిజిటల్‌లో పలు వస్తువులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఇవే ఆఫర్‌లను రూ.349కు కూడా పొందొచ్చు. కానీ ఇది నెల రోజుల వరకు మాత్రమే. అయితే ఈ రెండే కాకుండా మరో రిచార్జ్ ప్లాన్ కూడా ఉంది. రూ.2,545తో రిచార్జ్ చేసుకుంటో 336 రోజుల వరకు వాడుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక రోజుకు 1.5GB డేటా మాత్రమే లభిస్తుంది. ఇక మిగతావన్నీ యథావిధిగా ఉంటాయి. అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్‌ఎంస్‌లు పొందొచ్చు. కాగా ఈ ఆఫర్‌లను పొందాలనుకునే రిలయన్స్ జియో వినియోగదారులు మై జియో, జియో వెబ్ సైట్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్‌లలో(MyJio app, Jio website, PhonePe, Google Pay, Paytm) రిచార్జ్ చేసుకోవచ్చు.

Updated Date - 2023-08-10T18:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising