ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Smart Phones: కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?.. ఈ నెలలో విడుదలయ్యే ఫోన్లు ఇవే..

ABN, First Publish Date - 2023-01-01T22:15:05+05:30

పాత ఏడాది 2022 పోయి.. కొత్త సంవత్సరం 2023 వచ్చేసింది. ఈ కొంగొత్త ఏడాదిలో లెటెస్ట్ ఆవిష్కరణలు టెక్ ప్రియులను పలకరించబోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాత ఏడాది 2022 పోయి.. కొత్త సంవత్సరం 2023 వచ్చేసింది. ఈ కొంగొత్త ఏడాదిలో లెటెస్ట్ ఆవిష్కరణలు టెక్ ప్రియులను పలకరించబోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌లో పలు మొబైల్స్ మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 2023లో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్లపై ఒక లుక్కేద్దాం..

వన్‌ప్లస్ 11 5జీ (OnePlus 11 5G)

వన్‌ప్లస్ 11 5జీ (OnePlus 11 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఫిబ్రవరి 7, 2023న విడుదల చేయబోతున్నట్టు డిసెంబర్ 2022లో కంపెనీ ప్రకటించింది. అయితే అంతకంటే ముందే జనవరి 4న చైనాలో(China) ఈ మొబైల్ ఆవిష్కరణ జరిగింది. ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. హస్సెల్‌బ్లేడ్ కెమెరా సిస్టమ్, ట్రెడ్‌మార్క్ అలర్ట్ ఫీచర్లను కంపెనీ నిర్ధారించింది. ఇక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 12 సిరీస్ (Xiaomi Redmi Note 12 series)

షియోమీ మూడు వేరియెంట్లలో ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. రెడ్‌మీ నోట్ నోర్ 12 ప్రో, స్టాండర్‌ఫోన్ ‘రెడ్‌మీ నోర్ 12 ప్రో’, ప్రీమియంఫోన్ ‘రెడ్‌మీ నోట్12 ప్రో+’ లను విడుదల చేయబోతోంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్‌ ప్రత్యేకతల్లో ఫొటోగ్రఫీ హార్డ్‌వేర్ ప్రధానమైనది. 200ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాతోపాటు 2ఎంపీ మ్యాక్రో కెమెరా, ఫోన్ వెనుకవైపు ఎల్‌ఈడీ ఫ్లాష్, ముందువైపు 16ఎంపీ స్నాపర్ ఉండనున్నాయి. ఇక మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8జీబీ/12జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయుఐ 13 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లతో రానుంది.

రియల్‌మీ 10 సిరీస్..

కొత్త రియల్‌మీ ఫోన్ జనవరిలో విడుదలవుతుందనే అంచనాలున్నాయి. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 కవర్‌తో ఈ ఫోన్ రానుంది. మీడియాటెక్ హెలియో ఆక్టా-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13-బేస్డ్ రియల్‌మీ యుఐ, 8 జీబీ ర్యామ్, డ్యుయెల్ కెమెరా మ్యాడుల్ - 50ఎంపీ+2ఎంపీ ఫోన్ వెనుకవైపు ఎల్‌ఈడీ ఫ్లాష్, ముందువైపు 16ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది.

ఐక్యూవోవో 11 సిరీస్

ఐక్యూవోవో 11 సిరీస్ (iQOO 11 Series) ఫోన్లను జనవరి 10న విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రెండు వేరియెంట్లు ఐక్యూవోవో 11, 11 ప్రో ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయని వెల్లడించింది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్‌తో రానుంది. రెగ్యులర్ ఐక్యూవోవో 11 ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇక 11 ప్రో ఫోన్ 4800 బ్యాటరీతో రానుంది.

Updated Date - 2023-01-01T22:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising