ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రూ.2,500 లోపు ధరతో బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనాలనుకుంటున్నారా?.. అయితే ఇది మీ కోసమే..

ABN, First Publish Date - 2023-06-25T18:44:47+05:30

ప్రస్తుతం మానవ జీవితంలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (wireless earbuds) వాడకం సహజమైపోయింది. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ అమ్మాకాలను పెంచడానికి రూ.20,000 కంటే ఎక్కువ ధర ఉండే మొబైల్స్‌లో సదరు కంపెనీలు 3.5ఎంఎం ఉండే ఆడియో జాక్‌ను తొలగించాయి. దీంతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనుగోలులు గణనీయంగా పెరిగాయి. అయితే రూ.2,500 లోపు ధరతో ఉన్న టాప్ 5 వైర్‌లెస్ ఇయర్ బడ్స్ (5 best wireless earbuds under Rs 2,500) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం మానవ జీవితంలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (wireless earbuds) వాడకం సహజమైపోయింది. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ అమ్మాకాలను పెంచడానికి రూ.20,000 కంటే ఎక్కువ ధర ఉండే మొబైల్స్‌లో సదరు కంపెనీలు 3.5ఎంఎం ఉండే ఆడియో జాక్‌ను తొలగించాయి. దీంతో యూజర్ వైర్‌డ్ ఇయర్‌బడ్స్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనుగోలులు గణనీయంగా పెరిగాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న కంపెనీలు అనేక ఫీచర్లతో కూడిన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి తీసొకొచ్చాయి. అయితే రూ.2,500 లోపు ధరతో ఉన్న టాప్ 5 వైర్‌లెస్ ఇయర్ బడ్స్ (5 best wireless earbuds under Rs 2,500) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో ఎన్కో ఎయిర్ 2

ఈ ఒప్పో ఎన్కో ఎయిర్ 2 (Oppo Enco Air 2) వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ చూడడానికి యాపిల్ ఇయర్ పాడ్స్ మాదరిగానే కనిపిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్‌లో చాలా మందిని ఆకట్టుకునే క్లీన్, ఆడియోను బాగా బ్యాలెన్స్ చేసే ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ఇయర్‌బడ్స్‌లో మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు బ్యాగ్రౌండ్ సౌండ్‌ లోపలికి వినిపించకుండా నిరోధించే ఎఎన్‌సీ (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) వంటి హై-ఎండ్ ఫీచర్స్ లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. అయితే ఈ ఇయర్ బడ్స్ బ్యాటరీ లైఫ్ మాత్రం బాగుంది. ఒకసారి పుల్ చార్జింగ్ చేస్తే.. 24 గంటలు వస్తుంది. ఇక ఈ ఇయర్‌బడ్స్ ధర రూ.2,299గా ఉంది.

ఫ్లెక్స్‌నెస్ట్ ఫ్లెక్స్‌డబ్స్

ఫ్లెక్స్‌నెస్ట్ ఫ్లెక్స్‌డబ్స్(Flexnest Flexdubs) ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ప్రయోజనాన్ని అందిస్తాయి. అంటే సందడిగా ఉండే ఆఫీసు వాతావరణంలో పని చేస్తున్నప్పుడు లేదా ఇంకా ఎక్కడైనా మీకు ఇష్టమైనవి వింటున్నప్పుడు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. బయటి సౌండ్ లోపలికి రానివ్వదు. పైగా ఈ ఇయర్‌బడ్స్ తేలికైనవి. అయితే వీటికి యాప్ సపోర్టు లేకపోవడం వల్ల కావాల్సిన విధంగా సెట్టింగ్స్ చేసుకోవడం కష్టంతో కూడుకున్నది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఇయర్‌బడ్స్ ధర రూ.2,499గా ఉంది.

రెడ్‌మీ బడ్స్ 3 లైట్

మీకు మరింత కాంపాక్టు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కావాలంటే ఈ రెడ్‌మి బడ్స్ 3 లైట్ (Redmi Buds 3 Lite) ఉత్తమ ఎంపిక. సౌండ్ ఔట్ పుట్ సమతుల్యంగా ఉంటుంది. వీటి బ్యాటరీ కెపాసిటీ 18 గంటల వరకు ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్ టచ్ కంట్రోల్ సౌకర్యాన్ని కల్గి ఉండడం వల్ల సంగీతాన్ని నియంత్రించడం, కాల్స్ తీసుకోవడం సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే మిగతా వాటితో పోలీస్తే ఈ ఇయర్‌బడ్స్ డిజెన్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. కాబట్టి చిన్న ఇయర్‌బడ్స్ వాడిన వారికి కొంత అసౌకర్యంగా ఉండే అవకాశాలుంటాయి. కాగా ప్రస్తుతం వీటి ధర రూ.1,890గా ఉంది.

వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇవి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్ బడ్స్ (OnePlus Nord Buds) వాడుతున్నప్పుడు కాల్స్ వస్తే డిఫాల్ట్‌గా ఆడియో మనల్ని అలర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి బ్యాటరీ కెపాసిటీ 24 గంటలు ఉండడం గమనార్హం. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 24 గంటలు నిర్విరామంగా వాడుకోవచ్చు. ఇక వీటి ధర రూ.2,499గా ఉంది.

జేబీఎల్ వేవ్ 200

సంగీతంలో అదనపు బేస్‌ను కోరుకుంటే ఈ JBL Wave 200ని పరిగణనలోకి తీసుకోవడం మంచిది. వీటికి బ్లూటూత్, వాయిస్ అసిస్టెంట్, టచ్ కంట్రోల్స్, డ్యూయల్ కనెక్టివిటీ వంటివి కూడా సపోర్టు చేస్తాయి. చార్జింగ్ కోసం యూఎస్బీ సీ (USB-C) పోర్టు కూడా ఉంది. బ్యాటరిటీ కెపాసిటీ 20 గంటలుగా ఉంది. వీటి ధర రూ.2,499గా ఉంది. ఇవి ప్రస్తుతం మార్కెట్లో రూ.2,500 లోపు ఉన్న టాప్ 5 ఇయిర్‌బడ్స్.

Updated Date - 2023-06-25T18:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising