WhatsApp: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్..
ABN, First Publish Date - 2023-06-16T17:16:51+05:30
అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) తమ వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం విషయం తెలిసింది. ఇందులో భాగంగా ..
అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) తమ వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మరో కొత్త ఫీచర్‌ను త్వరలో ప్రవేశపెడతామని సంస్థ చెబుతోంది. ఆండ్రాయిడ్ (Android) వినియోగదారుల కోసం మల్టీ-అకౌంట్ ఫీచర్‌ను (multi-account feature ) అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకే వ్యక్తి.. ఒకే ఫోన్ (డివైజ్) నుంచి ఎన్నైనా (బహుళ) ఖాతాలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుందని WABetaInfo ద్వారా తెలుస్తోంది. వాట్సాప్ యూజర్ తొలిసారి అదనపు ఖాతాను తీసుకున్న తర్వాత లాగ్ ఔట్ చేసే వరకు డివైజ్‌లో సేవ్ చేయబడుతుంది.
ఒకే యాప్‌లో వినియోగదారులు వారి జీవితంలోని వ్యక్తిగత సంభాషణలు, పని సంబంధిత చర్చలు, సామాజిక అంశాలను చర్చించవచ్చు. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని పేర్కొంది. ప్రస్తుతం మల్టీ-ఖాతా ఫీచర్ అభివృద్ధిలో ఉందని, వాట్సాప్ అప్లికేషన్ ఫీచర్ బీటా పరీక్షకులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Updated Date - 2023-06-16T17:20:56+05:30 IST