ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahindra EV plant: రూ.1,000 కోట్లతో జహీరాబాద్‌లో మహీంద్రా ఈవీ ప్లాంట్‌

ABN, First Publish Date - 2023-02-10T02:50:00+05:30

హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలక్ర్టిక్‌ వాహనాల ఎక్స్‌పోలో అద్భుతమైన కారు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ యాక్సిలరేటింగ్‌ ప్యూర్‌ ఎలక్ర్టిక్‌ వాహనం అయిన హైపర్‌ జీటీ బటిస్టాను గురువారం ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఉన్న పరిశ్రమలోనే విస్తరణ

1,000 మందికి ఉద్యోగ అవకాశాలు

రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం

ఈ కారు విలువ రూ. 18 కోట్లు

హౖదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలక్ర్టిక్‌ వాహనాల ఎక్స్‌పోలో అద్భుతమైన కారు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ యాక్సిలరేటింగ్‌ ప్యూర్‌ ఎలక్ర్టిక్‌ వాహనం అయిన హైపర్‌ జీటీ బటిస్టాను గురువారం ఆవిష్కరించారు. దేశంలో మొదటగా హైదరాబాద్‌లో ఈ కారును ఆవిష్కరించడం విశేషం. పర్యావరణహిత వాహనాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న మొబిలిటీ వీక్‌లో భాగంగా జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లే ఈ ఎలక్ర్టిక్‌ స్పోర్ట్స్‌ కారును టీ వర్క్స్‌ సీఈఓ సుజయ్‌కారంపురి, మహీంద్రా అండ్‌ మహీంద్రా యూరప్‌ బిజినెస్‌ సీఈఓ గురుప్రతాప్‌ బొపరాయ్‌, ఆటోమొబిలి పిన్‌ఇన్‌ఫరీనా సీఈఓ పాఓలో డెలాచలు విడుదల చేశారు. మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఇటలీ లగ్జరీ కారు బ్రాండ్‌ ఆటోమొబిలి పిన్‌ఇన్‌ఫరీనా తయారు చేసిన హైపర్‌ జీటి బటిస్టా కారు దేశీయ మార్కెట్లో అందుబాటులోకి వస్తోంది. ఈ కారు ధర రూ.18 కోట్లు. 1.86 సెకన్ల వ్యవధిలో సున్నా నుంచి 100 కిలో మీటర్లు, 4.75 సెకన్లలో 200 కిలో మీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. పూర్తిగా విద్యుత్తు చార్జింగ్‌తో నడిచే ఈ కారు గరిష్ఠంగా 350 కి.మీ.ల వేగంతో దూసుకుపోతుంది.

120 కిలో వాట్స్‌ సామర్థ్యం ఉండే బ్యాటరీలో 6960 లిథియం అయాన్‌ సెల్స్‌ ఉంటాయి. రెండు టన్నుల బరువుండే వాహనంలో మూడో వంతు బ్యాటరీ బరువు ఉంటుంది. ఒక్కసారి పూర్తిస్థాయిలో చార్జ్‌ చేస్తే.. 476 కి.మీలు ప్రయాణించవచ్చు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యాక్సిలరేటింగ్‌ కారు ఇది. 25 నిమిషాల్లోనే 80 శాతం మేర బ్యాటరీ చార్జ్‌ అవుతుంది. ఈ కారు ఆవిష్కరణ సందర్భంగా సుజయ్‌ మాట్లాడుతూ మహీంద్రా గ్రూప్‌ ద్వారా ఆధునాతన సాంకేతికతతో కూడిన వాహనం రావడం సంతోషమన్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ-ప్రిక్స్‌ సర్క్యూట్‌లో బటిస్టా కారు పాల్గొంటుందన్నారు.

Updated Date - 2023-02-10T02:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising