ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

20 కోట్ల శునకం

ABN, Publish Date - Dec 17 , 2023 | 04:02 AM

ఓ మై ‘డాగ్‌’.. మీకీ శునకం గురించి తెలుసా ? ఇది ఆషామాషీ శునకం కాదు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన శునకాల్లో ఒకటి. కొకేజియన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన హైడర్‌ అనే ఈ శునకం ఖరీదు అక్షరాలా రూ.20 కోట్లు.

హైదరాబాద్‌లో సందడి చేసిన ‘హైడర్‌’

డాగ్‌ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి

మియాపూర్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఓ మై ‘డాగ్‌’.. మీకీ శునకం గురించి తెలుసా ? ఇది ఆషామాషీ శునకం కాదు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన శునకాల్లో ఒకటి. కొకేజియన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన హైడర్‌ అనే ఈ శునకం ఖరీదు అక్షరాలా రూ.20 కోట్లు. అవును.. ఇంత ఖరీదైన ఈ శునకం శనివారం హైదరాబాద్‌లో సందడి చేసింది. ఈ శునకాన్ని ఆరోగ్య పరీక్షల నిమిత్తం శేరిలింగంపల్లి, మదీనగూడలోని విశ్వాస్‌ పెట్‌ క్లినిక్‌కు దాని యజమాని తీసుకొచ్చారు. ఇండియన్‌ డాగ్‌ బ్రీడర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, బెంగళూరుకు చెందిన సతీష్‌.. హైదరాబాద్‌కు చెందిన ఓ పెంపకందారుడి వద్ద ఈ శునకాన్ని రూ.20 కోట్లకు ఈ ఏడాది ప్రారంభంలో కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. రష్యా, టర్కీ, అర్మేనియా, జార్జియాల్లో ఉండే కొకేజియన్‌ షెపర్డ్‌ జాతి శునకాలు భారత్‌లో కనిపించడం చాలా అరుదు. భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఈ శునకానికి సతీష్‌ కెటబామ్స్‌ హైడర్‌ అనే పేరు పెట్టారు. ఓ డాగ్‌ షో కోసం హైడర్‌ హైదరాబాద్‌ రాగా స్థానికులు పోటీపడి సెల్ఫీలు తీసుకున్నారు. అనేక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న హైడర్‌ ఇప్పటిదాకా 32 పతకాలు సాధించిందని, పలు సినిమాల్లో కూడా కనిపించిందని సతీష్‌ వెల్లడించారు. రెండున్నరేళ్ల వయస్సు కలిగిన హైడర్‌ రోజుకు మూడు కిలోల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుందని సతీష్‌ తెలిపారు. కాగా, శునకాలను అమితంగా ఇష్టపడే సతీశ్‌ గతంలోనూ పలు అరుదైన జాతుల కుక్కలను రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. రూ.10 కోట్ల ఖరీదైన టిబెటన్‌ మస్తిఫ్‌, రూ.8 కోట్ల అలస్కన్‌ మాలామ్యూట్‌, రూ. కోటి విలువైన రెండు కొరియన్‌ డోసా మస్తిఫ్‌ జాతి కుక్కలూ ఉన్నాయి. 2016లో ఒక్కోటి రూ.కోటి చొప్పున రెండు మస్తిఫ్‌ శునకాలను చైనా నుంచి బెంగళూరుకు దిగుమతి చేసుకున్న సతీష్‌ వాటిని రోల్స్‌ రాయిస్‌ కారులో విమానాశ్రయం నుంచి తీసుకొచ్చి వార్తలకెక్కారు.

Updated Date - Dec 17 , 2023 | 04:02 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising