TS RTC: ఆర్టీసీ ఉద్యోగులకు 4.9% కరువు భత్యం
ABN, First Publish Date - 2023-06-02T02:20:58+05:30
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. జూలై 2022లో ఇవ్వాల్సిన 4.9ు డీఏను మంజూరు చేస్తున్నట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దశాబ్ది ఉత్సవాల కానుక: టీఎస్‌ఆర్టీసీ
జూన్ నెల వేతనంతో చెల్లింపు
మరో డీఏకు త్వరలోనే చర్యలు
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. జూలై 2022లో ఇవ్వాల్సిన 4.9ు డీఏను మంజూరు చేస్తున్నట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి దీనిని చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలున్నా ఆర్టీసీ ఏడు డీఏలను మంజూరు చేసిందని, మిగిలిన మరో డీఏను త్వరలోనే ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఆర్టీసీ ప్రకటించిన మరో విడత డీఏను స్వాగతిస్తున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి తెలిపారు. డీఏ బకాయిలను ప్రకటించకపోవడంతో ఒక్కో కార్మికుడు లక్షల్లో నష్టపోవాల్సి వస్తోందని, మిగిలిన డీఏలను కూడా ప్రకటించేలా ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు బకాయిలను చెల్లించడంతో పాటు పీఆర్‌సీ ప్రకటించి, గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, 2017, 2021 పీఆర్‌సీలు ప్రకటించకుండా, అలవెన్స్‌లు పెంచకుండా, తొమ్మిది లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ వేతనం చెల్లించకుండా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా డీఏ ప్రకటనతో సరిపెట్టడం సరికాదని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు పేర్కొన్నారు. డీఏ బకాయిలను చెల్లించడంతో పాటు తక్షణమే ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - 2023-06-02T03:57:16+05:30 IST