ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొంతెండుతున్న పల్లెలు

ABN, First Publish Date - 2023-05-24T00:23:42+05:30

అధికారుల నిర్ల క్ష్యం.. పాలకుల అలసత్వం పల్లెల్లోని ప్రజల దాహార్తి తీరడం లేదు. తాగునీటి కోసం ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అధికారులు, పాలకులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండటంతో ప్రజల దాహార్తి తీర్చే పరిస్థితి లేకుండా పోతుంది.

అవంతీపురంలోని మిషన భగీరథ ప్లాంట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొంతెండుతున్న పల్లెలు

అస్తవ్యస్తంగా మిషన భగీరథ పథకం

పట్టింపులేని అధికార యంత్రాంగం

మిర్యాలగూడ రూరల్‌, మే 23: అధికారుల నిర్ల క్ష్యం.. పాలకుల అలసత్వం పల్లెల్లోని ప్రజల దాహార్తి తీరడం లేదు. తాగునీటి కోసం ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అధికారులు, పాలకులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండటంతో ప్రజల దాహార్తి తీర్చే పరిస్థితి లేకుండా పోతుంది. ఆయకట్టు ప్రాంతమైనా అడుగడుగునా గ్రామాల్లో నీటి కొరత తీవ్ర స్థాయిలో నెలకొం ది.ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రూ. 14.85 కోట్లతో అవంతీపురం వద్ద మిషన భగీరథ ప్లాం ట్‌ను ఏర్పాటు చేసింది. పేరుకే ప్లాంట్‌ పక్కనే ఉన్నా సమీపంలోని ఏ పల్లెకూ నిరంతరం తాగునీరు అందించిన దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవంతీపురంలోని నిజాం షుగర్స్‌కు చెందిన 23 ఎకరాల విస్తీర్ణంలో రోజుకు 90 మిలియన లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను నిర్మించారు. దీనిద్వారా రూరల్‌ పరిధిలో 2017 హ్యాబిటేషన్లు, మిర్యాలగూడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట మునిసిపాలిటీలకు తాగునీరు అందించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో వారు ఆడిందే ఆటగా పనులు సాగాయి. నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో పైపులైన లీకేజీలు, మోటార్‌ మరమ్మతులు ఎల్లప్పుడూ సాగుతూనే ఉన్నాయి. అధికారులు కాంట్రాక్టర్లకు అనుగుణంగా వ్యవహరిస్తుండటంతో సమస్యను త్వరితగతిన పరిష్కరించే మార్గం లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నా యి. ప్రస్తుతం భగీరథ ప్లాంట్‌లో మూడు మోటార్లు ఉండగా 15 రోజుల క్రితం రెండు మోటార్లు పనిచేయ డం లేదు. దీంతో నీటి సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గ్రామాల్లో పాలకుల పనితీరు, నీటి సరఫరా అధికారుల తీరుతో ప్రజలకు వేసవి దాహార్తి తీరే పరిస్థితులు కనిపించడం లేదు.

తాగునీటి కోసం ఆందోళనలు

మిర్యాలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం ఆందోళనలు చేపడుతున్నారు. జప్తివీరప్పగూడెం గ్రామంలో సో మవారం గ్రామస్థులు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామపంచాయతీ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. పది రోజుల నుంచి తాగునీటి కోసం అధికారులను, నాయకులను వేడుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలు సైతం తాగునీరు లేక అల్లాడుతున్నాయని పేర్కొన్నారు. అధికారులకు, పంచాయతీ సిబ్బందికి మఽధ్య సమన్వయం లేకపోవడంతో పాటు పాలకులు పట్టించుకోక పోవడంతో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-05-24T00:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising