ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Errabelli: అంధత్వరహిత రాష్ట్రమే లక్ష్యం

ABN, First Publish Date - 2023-01-19T19:35:19+05:30

అంధత్వ రహిత రాష్ట్రమే సీఎం కేసీఆర్‌ (CM KCR) లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయపర్తి: అంధత్వ రహిత రాష్ట్రమే సీఎం కేసీఆర్‌ (CM KCR) లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) అన్నారు. గురువారం వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు ఏది అవసరమో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) దాని పైనే దృష్టి సారిస్తోందన్నారు. కంటి సమస్యలతో నేడు ఎన్నో బాధలు పడుతున్న ప్రజల కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి ఉచితంగా అద్దాలు ఇవ్వడంతోపాటు ఆపరేషన్లు సైతం ప్రభుత్వ ఖర్చులతో చేస్తున్నామని తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు వెళ్లలేక ఎంతో మంది ఇంటి వద్దనే ఉంటూ కాలం వెల్లదీస్తున్నారని, వారి కోసం సీఎం ఆలోచన చేసి ఈ పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి వెల్లడించారు. రాయపర్తిలో 26రోజుల పాటు కంటి వెలుగు పరీక్షలు జరుగుతాయని, వాటి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, ప్రజలు సకాలంలో వచ్చి పరీక్షలు చేసుకోవాలన్నారు. పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కంటి సమస్యలు ప్రతీ ఒక్కరిలో ఉన్నాయని, ఈ కంటి వెలుగు పథకాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి పెండ్లి చేసుకునే వరకు సీఎం ప్రభుత్వ సహకారం అందిస్తున్నాడని ఇలాంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలపడం సీఎం కేసీఆర్‌ పని తనానికి నిదర్శనమని దయాకర్‌రావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-19T19:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising