ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SangaReddy Techie: పాపం ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. అందుకే నెత్తీనోరూ బాదుకుని ‘వద్దూవద్దూ’ అని చెప్పేది.. ఇప్పుడు చూడండి.. ఏమైందో..!

ABN, First Publish Date - 2023-04-28T17:33:24+05:30

ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి మోసపోయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడగా గురువారం ఉదయం వెలుగుచూసింది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

* ఆన్‌లైన్‌ మోసాలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలి

* రూ.12 లక్షలు కోల్పోయి ఉరేసుకుని ఆత్మహత్య

* సంగారెడ్డిలో విషాదం

* మూడునెలల క్రితమే వివాహం

* వచ్చే నెలలో చెల్లెలి పెళ్లి

సంగారెడ్డి: దురాశ దు:ఖానికి చేటు అని చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. కానీ.. కొందరికి మెదడులో ఏ పురుగు పుడుతుందో తెలియదు గానీ కొన్నిసార్లు ఈ మాటను మరిచి దురాశకు పోతుంటారు. దురాశకు పోవద్దని పెద్దవాళ్లు ‘వద్దు..వద్దు’ అని నెత్తీనోరూ బాదుకుని చెప్పినా ఆ సమయంలో చెవికెక్కించుకోరు. ఫలితంగా పర్యవసానాలను తట్టుకోలేక కట్టుకున్నోళ్లను, కన్నవాళ్లను వదిలేసి ఈ లోకం నుంచి నిష్క్రమిస్తుంటారు. అలాంటి ఒక విషాద ఘటనే ఇది. ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి మోసపోయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి (Software Employee) బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడగా గురువారం ఉదయం వెలుగుచూసింది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో (Sanga Reddy Town) చోటుచేసుకున్నది. పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెంకు చెందిన వడిత్య అరవింద్‌ (30) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సంగారెడ్డి పట్టణంలో గొల్లగూడెం కాలనీలో తల్లిదండ్రులు, భార్య సమతతో కలిసి నివాసముంటున్నాడు.

ఇటీవల టెలిగ్రామ్‌లో వచ్చిన లింకు (Telegram Links) ఓపెన్‌ చేసి వర్క్‌ఫ్రం హోం (Work From Home) ఎంచుకొని కొన్ని టాస్క్‌లు చేసేవాడు. అయితే అతను రూ.200 పెడితే రూ. 250 సైబర్‌ నేరగాళ్లు అతనికి పంపించారు. అధిక డబ్బు ఆశతో మొత్తం రూ.12 లక్షల వరకు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ పెట్టాడు. ఆ తర్వాత అన్ని టాస్క్‌లు పూర్తి చేసినా సైబర్‌ నేరగాళ్ల నుంచి స్పందన రాలేదు. వచ్చే నెల 5న అరవింద్‌ చెల్లెలు అలేఖ్య పెళ్లి ఉండటంతో ఇంట్లో ఖర్చులకు తెచ్చిన డబ్బును అరవింద్‌ వాడుకున్నాడు. తన చెల్లెలు పెళ్లికి తెచ్చిన రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఆ డబ్బు వెంటనే ఇవ్వాలని అతను పలుమార్లు టెలిగ్రామ్‌లో సైబర్‌ నేరగాళ్లకు వేడుకున్నాడు.

కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మనస్థాపానికి గురైన అరవింద్‌ సంగారెడ్డి పట్టణంలోని తన ఇంట్లో సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సంగారెడ్డి రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని సెల్‌ఫోన్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకొని సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. టెలిగ్రామ్‌లో చేసిన చాటింగ్‌, ఆన్‌లైన్‌ ద్వారా పంపిన డబ్బుల వివరాలు, సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. మృతుని తండ్రి వి.దేవీదాస్‌ అందోల్‌ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. తల్లి నాగమణి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు కాగా అరవింద్‌ రెండో కుమారుడు. అరవింద్‌కు మూడునెలల క్రితమే వివాహామైంది.

బొమ్మారెడ్డిగూడెంలో అంత్యక్రియలు

పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొమ్మారెడ్డిగూడెంలో అరవింద్‌ మృతదేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుని తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో అంత్యక్రియలకు ఉపాధ్యాయ, ఉద్యోగులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

సూసైడ్‌ నోట్‌లో ఇలా..

మంచిగ చూస్కోండి... చాలా కష్టాలు పడుతున్నారు.. ప్లీజ్‌... చూస్కోండి.. మామా... సమతను ఎటువంటి కష్టం బాగా చూసుకో.. ఆమెకు ఒక జీవితం ఇయ్యు.. సమత చాలా మంచిది... ఆమె లైఫ్‌ కరాబ్‌ చేసిన ప్లీజ్‌ మామా.. ఆమెను జాగ్రత్తగా చూసుకో... సూర్య మామ నువ్వు జీవితాంతం క్షమించు... చాలా నమ్మి అందరు వచ్చారు... నాకు పిల్లని ఇచ్చారు...నేను మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను... నన్ను క్షమించు మామ... నన్ను క్షమిస్తావు నాకు తెలుసు... మా వాళ్లకి ఎలాంటి ఇబ్బంది కలిగించకు వాళ్లకు ఏం తెలీదు... ఐయాం రియల్లీ సారీ... మైహోల్‌ ఫ్యామిలీ మిస్‌యు ఆల్‌... చిన్ను మిస్‌ యు ఎ లాట్‌... ప్లీజ్‌ ఇఫ్‌ యు కెన్‌ ఫర్‌గీవ్‌ మి ప్లీజ్‌... లవ్‌ యు సోమచ్‌... ఐయాం రియల్లీ సారీ... మై డెత్‌ డేట్‌... 26.04.2023... మై బర్త్‌ డేట్‌... 30.04.1998.. మిస్‌ యు ఆల్‌... అంటూ సూసైడ్‌ లెటర్‌ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - 2023-04-28T17:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising