ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వాడవాడలా ఎగిరిన జెండా

ABN, First Publish Date - 2023-08-15T22:45:34+05:30

జిల్లా వ్యాప్తంగా మంగళవారం స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వాడవాడలా జెండా ఎగురవేశారు.

కాగజ్‌నగర్‌లో జెండాకు వందనం చేస్తున్న ఎమ్మెల్యే కోనప్ప

ఆసిఫాబాద్‌, ఆగస్టు 15: జిల్లా వ్యాప్తంగా మంగళవారం స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వాడవాడలా జెండా ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయజెండాను ఎగుర వేశారు. కోర్టు అవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్‌, డీపీవో కార్యాలయంలో ఎస్పీ సురేష్‌కుమార్‌, తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అత్రం సక్కు, వివేకానందచౌక్‌లో టీజీవో ఉమ్మడి జిల్లా ఆధ్యక్షుడు శ్యాంనాయక్‌లతో పాటు అయా ప్రభుత్వ కార్యాలయాల్లో అయా శాఖల ఉన్నతాధికారులు జెండాలను అవిష్కరించారు.

కాగజ్‌నగర్‌: పట్టణంలో పలు చోట్ల జెండాలు ఎగురవేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప క్యాంపు కార్యాలయం, గాంధీ పార్కులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీ కార్యాలయంలో, బీజేపీ కార్యాయలంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సమన్వయ కర్త కోరల్ల కృష్ణారెడ్డి, నవోదయ విద్యాలయంలో చక్రపాణి, ప్రజా కార్యాలయంలో డాక్టర్‌ హరీష్‌బాబు, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో జాడి రాజేశ్వర్‌, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కరుణాకర్‌, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ భవనంలో అధ్యక్షుడు జయదేవ్‌ జెండా ఎగురవేశారు. మార్కెట్‌ కార్యాలయంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ శంకర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ప్రమోద్‌, తహసిల్దార్‌ శ్రీపాల్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ గిరిష్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కాసం శ్రీనివాస్‌, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నవోదయా విద్యాలయంలో జరిగిన వివిధ పోటీల విజేతలకు ప్రిన్సిపాల్‌ చక్రపాణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ హరీష్‌ బాబు బహుమతులను అందజేశారు. బీజేపీ కార్యాలయంలో ప్రతిజ్ఙ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రెబ్బెన: మండల వ్యాప్తంగా జెండా వేడుకలు నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సౌందర్య, సీఐ కార్యాలయంలో సీఐ నరేందర్‌, సింగిల్‌ విండో కార్యాలయంలో ఛైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌ జెండా ఎగురవేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఆహల్యాదేవి, సుమలత, సోమశేఖర్‌, వినోద, సంధ్యారాణి, వినోద్‌, పోచమల్లు, తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా ట్రేడ్‌యూనియన్‌ కార్యాలయాల్లో శ్రీనివాసరావు, తిరుపతి, తదితరులు జాతీయ జెండా ఎగురవేశారు.

సిర్పూర్‌(యు): మండల వ్యాప్తంగా జెండాలు ఎగురవేశారు. ఆయా కార్యాలయాల్లో తహసీల్దార్‌ రమేశ్‌, ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి, డాక్టర్‌ సుంకన్న, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకట్‌స్వామి, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి స్వప్న, ప్రధానోపాధ్యాయుడు ఆత్రం ఆనంద్‌రావు, గెడం జగ్జివన్‌, గెడం నాగోరావు సర్పంచులు సర్పంచ్‌ వీణాబాయి, పెందోర్‌ నాగోరావు,మేస్రం భూపతి,సలాం లక్ష్మిబాయి,ఆర్క హిరాబాయి,ఆత్రం పద్మబాయి,ఆత్రం మెంగోరా, మహగాం గిరిజన ఆశ్రమ పాఠశా ప్రాధానోపాధ్యాయురాలు ఆనిత, తోడసం భగవంత్‌రావు జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జైనూర్‌ ఏఎంసీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌, ఎంపీటీసీ గెడం సార్జబాయి, నాయకులు తోడసం ధర్మరావు, పీఎసీ చైర్మన్‌ కేంద్రే శివాజీ, ఆడ వేంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

జైనూరు: మండల వ్యాప్తంగా జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌, ఎంపీపీ కుంర తిరుమల, మార్కెట్‌ కార్యాలయ కార్యదర్శి ఈక్ఫాన్‌, ఎస్సై సందీప్‌, సీఐ మల్లేశం, ఎస్‌బీఐ మేనేజర్‌ గోపాలక్బష్ణ, సహకార బ్యాంకు మేనేజర్‌ డాక్టర్‌ సత్యశివాని, ఐకెపీ ఏపీఎం సుజాత, అధ్యక్షురాలు కొడప మోతుబాయి, సీడీపీవో ఇందిర ఆయా కార్యాల యాల్లో జెండా ఎగురవేశారు. ఎంఈవో కుడ్మెత సుధాకర్‌, హెచ్‌ఎంలు జాదవ్‌ రమేష్‌, మండాడి సోనేరావ్‌, పార్వతీబాయి, పర్శురాం, గాగృ, స్వర్ణలత, ఎస్‌వో సుమలత,నిలకంఠ్‌, బళిరాం ఆయా పాఠశాలల్లో జెండాలు ఎగురవేశారు. గ్రాయ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు జెండా ఆవిష్కరించారు.

లింగాపూర్‌: మండల కేంద్రంలో ఎంపీపీ సవితప్రేం, ఎస్సై మనోహర్‌, ప్రసాద్‌, తహసీ ల్దార్‌, రాజేంద్ర ప్రసాద్‌, ఎంపీడీవో ప్రసాద్‌ జెండా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో నిర్వహిం చిన పంద్రాగస్టు వేడుకల్లో పద్మశ్రీ కనకరాజు గుస్సాడీ బృందం పాల్గొంది. ఆయా కార్యక్ర మాల్లో ఎంపీపీ కుంర తిరుమల, సహకార సంఘం చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, జిల్లా సీని యర్‌ నాయకులు మేస్రాం అంబాజీరావ్‌, ఆర్‌ఐ సుధాకర్‌, వైద్యాధికారి జితేందర్‌రెడ్డి, సూపర్‌ వైజర్లు రమేశ్‌, హెచ్‌ఈవో పవార్‌ దిలీప్‌కుమార్‌, వ్యాపారులు రమేశ్‌, ముబారక్‌సేట్‌, కోటగిరి శ్రీనివాస్‌, భతానె గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి: మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నాగరాజుగౌడ్‌, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నానయ్య, పాఠశాలలో హెచ్‌ఎం దేవాజీ, పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేధికారి సుధాకర్‌రెడ్డి, పోలీసు స్టేషన్‌లో ఎస్సై వెంకటేష్‌ జెండా ఎగురవేశారు. ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎం కన్నయ్య, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం తిరుపతి, కేజీబీవీలో ఇన్‌చార్జి ఎస్‌ఓ శ్రీదేవి, తదితర సంస్థలు, సంఘాలలో జాతీయ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణగౌడ్‌, నాయకులు నాజీంహుస్సెన్‌, ఏపీఓ గోవర్ధన్‌సింగ్‌, మారుతి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు: మండల వ్యాప్తంగా జెండాలు ఎగురవేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ బ్రహ్మేశ్వర్‌, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రోజారమణి, పోలీసు స్టేషన్‌లో ఎస్సై విక్రం, కేజీబీలో ప్రత్యేకాధికారిణి అరుణ, ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు మారుబాయి, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్‌ఆర్వో దయాకర్‌, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఓ రాజుల నాయుడు జెండా ఎగురవేశారు. పీఏసీఎస్‌లో చైర్మన్‌ ఓం ప్రకాష్‌, పీహెచ్‌సీలో డాక్టర్‌ అమర్‌, గ్రామపంచాయతీలో సర్పంచ్‌ అన్సార్‌హుస్సేన్‌, తదితరులు జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్‌ జగ్గాగౌడ్‌, జడ్పీటీసీ పుష్పలత, నాయకులు బషరత్‌ఖాన్‌ శ్రీవర్ధన్‌, పురుషోత్తంచారి, మహేష్‌ పాల్గొన్నారు.

పెంచికలపేట: మండల వ్యాప్తంగా జెండాలు ఆవిష్కరించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సరిత, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సుజాత, పోలీసు స్టేషన్‌లో ఎస్సై కొమురయ్య, జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు యాదగిరి, శ్రీనివాస్‌, అటవీ శాఖ కాఆర్యాలయంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి ప్రభాకర్‌, పీహెచ్‌సీలో డాక్టర్‌ నేహాతస్లీమా, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జెండాలను ఎగురవేశారు.

కెరమెరి: మండల వ్యాప్తంగా జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జమీర్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మోతరాం, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఓ గోపికాంత్‌, గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ బయ్యనబాయి, పోలీసు స్టేషన్‌లో ఎస్సై విజయ్‌, ఐకేపీలో అధ్యక్షురాలు జ్యోతికళ జెండాలు ఎగురవేశారు. జడ్పీ పాఠశాలలో హెచ్‌ఎం ప్రకాష్‌, పీఏసీఎస్‌లో అధ్యక్షుడు శంకర్‌, పీహెచ్‌సీలో డాక్టర్‌ వినోద్‌, పశువైద్యశాలలో వీఏ సోనియా, బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఉత్తంనాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కుసుంరావులు జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దృపతాబాయి, వైస్‌ ఎంపీపీ అబ్దుల్‌ కలాం తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి: మండల వ్యాప్తంగా జెండాలు ఎగురవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీదేవి, తహసీల్దార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ రాంలాల్‌, ఎంఆర్‌పీఎస్‌ కార్యాలయంలో అధ్యక్షుడు అశోక్‌, బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు వెంకటేష్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు సాగర్‌, మార్కెట్‌ కమిటీలో డైరెక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, సీపీఐ కాఆర్యాలయంలో అధ్యక్షుడు లచ్చగౌడ్‌ జెండాలు ఎగరవేశారు. దానిఈ ఫౌండేషన్‌ కార్యాలయంలో చంద్రకళ, పశువైద్య శాలలో డాక్టర్‌ రామకృష్ణ, ఆటో యూనియన్‌లో ఎస్సై రమేష్‌, ఆర్‌ఎస్‌ఎస్‌లో అరుణ్‌, పీఏసీఎస్‌లో చైర్మన్‌ శ్రీనివాస్‌, జడ్పీ పాఠశాలలో ప్రధానోపా ధ్యాయుడు రాము, ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు షేక్‌, వ్యవసాయ శాఖలో ఏఓ తిరుమలేశ్వర్‌, అంబేద్కర్‌ భవన్‌లో అధ్యక్షుడు రాజయ్య జెండాలను ఆవిష్కరించారు.

వాంకిడి: మండల వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రహీముద్దీన్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ విమలబాయి, ఐసీడీఎస్‌లో సీడీపీవో రిబ్కా, వ్యవవసాయ శాఖలోఓ ఏవో మిలింథ్‌కుమార్‌, పీఏసీఎస్‌లో చైర్మన్‌ పెంటు, పోలీసు స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్‌, ఐకేపీలో ఏపీఎం మహేష్‌, ఎస్‌సీ హస్టల్‌లో వార్డెన్‌ తిరుపతి, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు నారాయణ, టీఆర్‌ఎస్‌ కార్యాల యంలో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జెండాలను ఎగురవేశారు.

సిర్పూర్‌(టి): మండల వ్యాప్తంగా స్వాతంత్య్రవేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ తఫీమా పర్వీన్‌, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సువర్ణ, వ్యవసాయ శాఖలో ఏవో మధులత్‌, ఏఈవో మమకవిత, పోలీసు స్టేషన్‌లో ఎస్సై దీకొండ రమేశ్‌ జెండా ఎగురవేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ లలితతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగుర వేశారు.

దహెగాం: మండల వ్యాప్తంగా జెండాలు ఎగురవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సులోచన, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సరిత, పీఏసీఎస్‌లో చైర్మన్‌ తిరుపతిగౌడ్‌, పోలీసు స్టేషన్‌లో ఎస్సై సనత్‌కుమార్‌, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఏఈ రవీందర్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ స్పందన, గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీడీఓ కార్యాల యంలో ఏవో వంశీకృష్ణ, పశువైద్యశాలలో డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌లు, బీజేపీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు ధనుంజయ్‌తో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలో జాతీయ జెండాను ఎగుర వేశారు.

కౌటాల: మండల వ్యాప్తంగా వాడవాడన జెండాలు ఎగురవేవవరు. పోలీసు స్టేషన్‌లో సీఐ సాదీక్‌పాషా, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మష్కూర్‌ అలీ, ఎంపీడీవో కార్యాలయంలో వైస్‌ ఎంపీపీ అమ్మక్క, పీఏసీఎస్‌లో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య జెండా ఆవిష్కరించారు. రైతు వేదికలో ఏఓ రాజేష్‌, ఎంఆర్సీలో ఎంఈఓ సోమయ్య, గ్రామపంచాయతీలో సర్పంచ్‌ మౌనీష్‌, డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ కిరణ్‌, పశువైద్య శాలలో డాక్టర్‌ శ్రీకాంత్‌, పీహెచ్‌సీలో డాక్టర్‌ నవత, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, పాఠశాలల్లో హెచ్‌ఎంలు జెండాలను ఎగుర వేశారు.

Updated Date - 2023-08-15T22:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising