ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా ఆదివాసీ కోలావార్ జెండా పండుగ
ABN, First Publish Date - 2023-01-08T22:58:01+05:30
చింతలమానేపల్లి, జనవరి 8: మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా ఆదివాసీ కోలావార్(మన్నెవార్) జెండా పండుగను జరుపుకున్నారు. ఈసందర్భంగా మహిళలు మంగళహారతులతో జెండా వద్దకు వచ్చి భీమదేవరకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
చింతలమానేపల్లి, జనవరి 8: మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా ఆదివాసీ కోలావార్(మన్నెవార్) జెండా పండుగను జరుపుకున్నారు. ఈసందర్భంగా మహిళలు మంగళహారతులతో జెండా వద్దకు వచ్చి భీమదేవరకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆదివా సులంతా ఐక్యంగాఉండాలని పలువురు మాట్లా డారు. కార్యక్రమంలో పూజారి భీమయ్య, సర్పంచ్ నానయ్య, నాయకులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి): మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం ఆదివాసీ కొలావార్(మన్నెవార్) జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్ర మంలో కొలావార్ సంఘంనాయకులు గోపాల్, భిక్షపతి,సత్తయ్య, పాల్గొన్నారు.
బెజ్జూరు: మండలకేంద్రంలో ఆదివాసీ కోలా వార్ ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా ఆదివా సీల కోలావార్ మండలాధ్యక్షుడు శంకర్ ఆధ్వ ర్యంలో జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, యువకులు, మహిళలు, తదిత రులు పాల్గొన్నారు.
కౌటాల: మండల కేంద్రంలోని కుమరంభీం, అంబేద్కర్, జ్యోతిబాఫూలే విగ్రహాలకు పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో ర్యాలీతీసి మండలకేంద్రంలోని ఆదివాసీల భవనం వద్ద ఆత్మగౌరవ భీమదేవరజెండాను ఎగురవే శారు. గురుడుపేట గ్రామంలో సంఘం జిల్లాఅధ్య క్షుడు బ్రహ్మయ్యఆధ్వర్యంలో ఆదివాసీల సంప్రదా య లక్ష్మిదేవర వేషాలతో భాజాభజంత్రీలతో ర్యాలీ నిర్వహించి భీమదేవర జెండాను ఎగురవేశారు. తలోడి గ్రామంలో ఆదివాసీ జెండాను ఎగురవేసి పండుగను జరుపుకున్నారు.అనంతరం గ్రామ శివారులోని భీమదేవర ఆలయం వద్ద మొక్కులు చెల్లిం చుకున్నారు. అన్నిగ్రామాల్లో ఆదివాసీలు సహ పంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో కొలావార్ నాయ కులు పోశం, సదాశివ్, బాపు, గోపాల్, బుచ్చన్న, సత్తయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-08T22:58:03+05:30 IST