ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-02-14T22:48:36+05:30

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ అన్నా రు.

గుడిపేటలో ఈజీఎస్‌ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజీపూర్‌, ఫిబ్రవరి 14: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ అన్నా రు. హాజీపూర్‌ మండలం గుడిపేట, ముల్కల్ల, రాపెల్లి గ్రామాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంగళవారం అదనపు కలెక్టర్‌ రాహుల్‌,ట్రైనీ కలెక్టర్‌ గౌతమితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. గుడిపేట పంచాయతీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సరోవర్‌లో చెరువు పూడిక తీత పనులను పరిశీలించారు. పని స్థలంలో ఉపాధి కూలీలతో పనులు జరుగుతున్న తీరు, కూలీ ధరలు, కొలతలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఉపాధి హామీలో నిర్వహిస్తున్న పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయడంతో పాటు సకాలంలో కూలీలకు డబ్బులు అందించాలన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున పని స్థలాల్లో తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ముల్కల గ్రామంలోని నర్సరీని సందర్శించారు. వచ్చే హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలన్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, బృహత్‌ పల్లె ప్రకృతివనం, ఐకేపీ ద్వారా చేపట్టిన పొలాలకు ఎరువులు చల్లే స్ర్పే డ్రోన్‌ కెమెరా పనితీరును పరిశీలించారు. ఐకేపీ నిదులతో ఏర్పాటు చేసిన బేకరీషాప్‌, ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, ఎంపీడీవో అబ్దుల్‌ హై, ఎంపీపీ మందపల్లిస్వర్ణలత, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-14T22:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising