ధర్మసాగర్ చెరువుకట్ట కనుమరుగు
ABN, First Publish Date - 2023-01-21T01:44:17+05:30
జిల్లా కేంద్రమైన నిర్మల్ నడిబొడ్డున గల ధర్మాసాగర్ చెరువు కట్టను అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ బడా నేత బంధువు నిర్ధాక్షణ్యంగా తవ్వేసి అక్కడి మట్టిని తరలించ డం వివాదాస్పదంగా మారుతోంది.
బీఆర్‌ఎస్ నేత బడాబంధువు నిర్వాకం
బహిరంగంగా కట్ట తొలగింపు
పక్కసర్వే నంబర్‌భూమి పేరిట తవ్వకం
మత్స్యకారుల ఫిర్యాదుతో వెలుగులోకి వ్యవహారం
పోలీసులకు, మున్సిపల్ కమిషనర్‌కు ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు
విచారణ జరపాలని కాంగ్రెస్, బీజేపీల నేతల డిమాండ్
నిర్మల్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రమైన నిర్మల్ నడిబొడ్డున గల ధర్మాసాగర్ చెరువు కట్టను అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ బడా నేత బంధువు నిర్ధాక్షణ్యంగా తవ్వేసి అక్కడి మట్టిని తరలించ డం వివాదాస్పదంగా మారుతోంది. గతంలో ఈ చెరువు లోని భూమిపై అనేక వివాదాలు కొనసాగాయి. బడా నేతకు సంబంధించిన ఈ భూమిని ఆయన బంధువుకు విక్రయించినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యక్తి అధికార పార్టీ నేతకు బినామీగా కూడా కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా ధర్మాసాగర్ చెరువు మధ్య లో శిఖంభూమి ఉండాలి. అలా కాకుండా ఈ భూములను పట్టాభూములుగా మార్చారంటున్నారు. పక్కన ఉన్న భూమి శిఖంభూమి కాగా దానికి ఆనుకొని ఉన్న ఈ భూమి పట్టాభూమిగా మారడం పట్ల అప్పట్లోనే అనుమా నాలు వ్యక్తమయ్యాయి. అయితే సదరు కబ్జాదారు తనదిగా చెప్పుకుంటున్న సర్వేనంబర్ భూమిని చదును చేసేందుకు ఈ చెరువు కట్టనే పూర్తిగా తవ్వేయడం వివాదాస్పదమవుతోంది. ఈ చెరువు కట్టను తవ్వడంతో చెరువులోని నీరంతా కింది ప్రాంతంలో గల జనావాసాల మధ్యకు చేరుకుంటుందంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో చెరు వు నీరంతా ఈ కట్టతవ్వకంతో జనావాసాల్లోకి ప్రవహించే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై స్థానిక మత్య్సకారులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. కట్టను తవ్వి న బడానేత బంధువును వీరు నిలదీసినప్పటికీ ఆయన తనకున్న పలుకుబడి, పరపతితో వారిపై ఎదురు తిరిగారన్న ఆరోపణలున్నాయి. మత్య్సకారులు చేసేదేమీ లేక అధికారులకు ఫిర్యాదు చేసి ఆందోళనకు సిద్దమవుతున్నా రు. అయితే మత్య్సకారుల పిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఇరిగేషన్ అధికారులు చెరువుకట్టను తవ్వేసిన వ్యవహారంపై విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్‌కు, టౌన్‌సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పట్టణ నడిబొడ్డున గల ధర్మాసాగర్ చెరువుభూమి ఇప్పటికే పెద్దఎత్తున ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడి శిఖంభూమిని కొంతమంది పట్టాభూములుగా మార్చి ఆక్ర మణలకు పాల్పడినట్లు విమర్శలున్నాయి. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమా రం రేగింది. ఓ బడా నేత కుమారునిపై శిఖం భూమి ని పట్టాగా మార్చారని, దీనిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ భూమిని విక్రయించారన్న విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయితే పట్టాభూమి పేరిట సదరు నేత బంధువు ఏకంగా చారిత్రక చెరువుకట్టకే కన్నం వేసి ఆ కట్టను తొలగించడం ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది.
చారిత్రక చెరువు కట్టకు కన్నం
ఇదిలాఉండగా గొలుసుకట్టు చెరువులకు కేంద్రంగా బాసిల్లే జిల్లా కేంద్రంలోని చారిత్రక ధర్మాసాగర్ చెరువుకట్టకు ఈ బడానేత బంధువు కన్నం వేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాజులపేట్ వెళ్లే దారివైపు ఈ చెరువు కట్టను పూర్తిగా తవ్వేసి సదరు వ్యక్తి తన భూమిగా చెప్పుకుంటున్న చోటుకు ఆ మట్టిని తరలించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ధర్మాసాగర్ చెరువు విస్తీర్ణం కబ్జాల కారణంగా గణనీయంగా తగ్గిపోయినట్లు స్థానిక మత్య్సకారులు ఆరోపిస్తున్నారు. అయితే శిఖంభూమితో పాటు దానికి ఆనుకొని ఉండే వందమీటర్ల భూమిని బఫ ర్ జోన్‌గా పిలుస్తారు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం శిఖం, బఫర్‌జోన్ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు గాని ఆ భూమిని చదును చేయడం గాని పూర్తిగా నిషేధం. చెరు వుకట్టను బహిరంగంగా తవ్వడం కూడా చట్ట విరుద్దమం టూ మత్య్సకారులు ఆరోపిస్తున్నారు.
ఆందోళనలో మత్స్యకారులు
ఇప్పటికే ధర్మసాగర్ చెరువు ఆక్రమణలకు గురి కావడంపై మత్య్సకారులు ఇటు ఇరిగేషన్ అఽధికారులకు, అటు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు సైతం చేశా రు. అధికారులు చెరువుకట్ట తవ్వకంపై చర్యలు తీసుకోనట్లయితే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామంటూ మత్య్సకారులు హెచ్చరిస్తున్నారు. తామంతా ఏళ్ల నుంచి ఈ చె రువుపై ఆధారపడి జీవిస్తున్నామని చెబుతున్నారు. ఇప్ప టికే చెరువు భూముల ఆక్రమణల కారణంగా నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని తద్వారా చేపల పెంపకం ఇబ్బందిక రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి చెరువుకట్టను తవ్వడంతో నీటినిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి చేపల పెంపకం కష్టతరమవుతోందని వారు వాపోతున్నారు. చెరువు కట్టను వెంటనే పునర్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్
కాగా ధర్మసాగర్ చెరువుకట్టను తవ్వేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. నిర్మల్‌లోని చారిత్రక చెరువులన్నీ ఇప్పటికే ఆక్రమణకు గురికాగా ధర్మాసాగర్ చెరువుకట్టను సైతం తవ్వేయడం ఏ మేరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో తవ్వేసిన చెరువుకట్టను పరిశీలిస్తామని దీనిపై అధికారులు స్పందించనట్లయితే ఆందోళనలు చేస్తామంటూ వారు బాహాటంగా పేర్కొంటున్నారు.
నా దృష్టికి రాలేదు : ఆర్డీఓ స్రవంతి
ధర్మసాగర్ చెరువుకట్ట తవ్విన విషయం నా దృష్టికి రాలే దు. ఒకవేళ చెరువుకట్టను ఆక్రమంగా తవ్వినట్లయితే చర్యలు తప్పవు. దీనిపై రెవెన్యూ అధికారుల చేత విచారణ జరిపిస్తాం. చెరువు భూముల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం.
చెరువుకట్ట తవ్వకంపై విచారణ జరుపుతున్నాం
చెరువుకట్ట తవ్వకం విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నాం. చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశాం. అలాగే టౌన్ సీఐకి కూడా దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాం. చెరువు భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- నరేష్, డిఈ ఇరిగేషన్ శాఖ
ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం
ధర్మాసాగర్ చెరువు కట్టను తవ్వేసిన విషయమై ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. చెరువుభూమిని ఆక్రమించినట్లు గాని చెరువు కట్టను ఆక్రమంగా తవ్వినట్లు గాని నిర్ధారణ జరిగితే ఉన్నతాధికారులకు తగు చర్యల కోసం నివేదిక పంపుతాం.
- సంపత్‌కుమార్, మున్సిపాలిటీ కమిషనర్, నిర్మల్
కఠినచర్యలు తీసుకోవాలి
చెరువుకట్టను తొలగించిన వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ నేతల బంధువులు, బినామీలు పెద్ద ఎత్తున చెరువుభూములతో పాటు ప్రభుత్వభూముల ఆక్ర మణలకు పాల్పడుతున్నారు. చారిత్రక ధర్మాసాగర్ చెరువు కట్టను తవ్వేయడం అన్యాయం. జిల్లాకేంద్రంలోనే ఇంత బహిరంగంగా ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తాం. అవసరమై తే కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాం.
- ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్
కఠినచర్యలు తీసుకోవాలి
జిల్లాకేంద్రంలోని గొలుసుకట్టు చెరువు భూములను ఇప్ప టికే అధికార పార్టీ నేతలు కొంతమంది ఆక్రమణలకు గురి చేశారు. చెరువు భూముల ఆక్రమణలపై రాష్ట్ర హైకోర్టు సైతం సీరియస్ అయ్యింది. జిల్లా న్యాయమూర్తి చేత వి చారణ కూడా చేశారు. మళ్ళీ ధర్మాసాగర్ చెరువు కట్ట తవ్వేయడం అన్యాయం. అధికారపార్టీ నేతల అండతోనే చెరువుకట్టను తవ్వేశారు. చెరువుకట్ట తవ్వకం వ్యవహారంపై బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. అఽధికారులు దీనిపై సీరియస్‌గా విచారణ జరిపి కఠినచర్యలు తీసుకోవాలి. చెరువు భూముల రక్షణకు చర్యలు చేపట్టాలి.
Updated Date - 2023-01-21T01:44:18+05:30 IST