ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఓటు వేయొద్దు

ABN, First Publish Date - 2023-09-01T22:45:07+05:30

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరు ఓటు వేయవద్దని ఆరిజన్‌ డెయిరీ నిర్వహకురాలు శేజల్‌ విజ్ఞప్తి చేశారు.

బెల్లంపల్లిలో దుకాణంలో ప్రచారం చేస్తున్న శేజల్‌

బెల్లంపల్లి, సెప్టెంబరు 1: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరు ఓటు వేయవద్దని ఆరిజన్‌ డెయిరీ నిర్వహకురాలు శేజల్‌ విజ్ఞప్తి చేశారు. బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం శేజల్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు షాపుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని, ఈవిషయాన్ని ప్రభుత్వం , అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో వేరే అభ్యర్ధులు ఎవరికైనా ఓట్లు వేయండి అని, లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యకు ఓట్లు వేయకండని కోరారు. మళ్లీ చిన్నయ్యకు ఓటు వేస్తే మహిళలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. శేజల్‌ ప్రచారానికి బీజేపీ , కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినకపోవడంతో శేజల్‌ను వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు శేజల్‌కు మద్దతు తెలిపిన బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులకు వ్యతిరేకంగా పట్టణంలోని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న శేజల్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలపడం సిగ్గు చేటన్నారు. రైతులను మోసం చేసిన ఆరిజన్‌ డెయిరీ నిర్వహకురాలు శేజల్‌కు వారు వత్తాసు పలకడం సరికాదని చెప్పారు. అనంతరం బీజేపీ పట్టణాధ్యక్షుడు కోడి రమేశ్‌ ఇంటి వద్దకు బీఆర్‌ఎస్‌ నాయకులు వెళ్లి ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని బీఆర్‌ఎస్‌ నాయకులను సముదాయించి పంపివేశారు.

Updated Date - 2023-09-01T22:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising