ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర

ABN, First Publish Date - 2023-04-02T22:39:48+05:30

జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్‌ వీరాంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హనుమాన్‌ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు.

శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 2: జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్‌ వీరాంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హనుమాన్‌ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. పదకొండు అడుగుల వీరాంజనేయస్వామి విగ్రహన్ని ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసిన మాలధారులు శోభాయాత్ర చేపట్టారు. ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, అలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, అలయ కమిటీ ప్రముఖులతో కలిసి స్వామివారికి పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. సాయిబాబా మందిర్‌, పొట్టి శ్రీరాము లుచౌక్‌, శివాకేశవాలయం, గణేష్‌మందిర్‌, కేశవనాథ్‌ అలయం, రావులవాడ, కసాబ్‌వాడ, సందీప్‌నగర్‌, బజార్‌వాడి, వివేకానందచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌ల మీదుగా శోభాయాత్ర కొనసాగింది. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే అత్రం సక్కులు శోభాయాత్రలో పాల్గొని భక్తులతో కలిసి నృత్యం చేశారు. శోభాయాత్ర సందర్భంగా భక్తులు పాలు, పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్‌, మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వెంకన్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఖాండ్రే విశాల్‌, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, ఆల య కమిటీ ఆధ్యక్షులు డి వెంకటేశ్వర్లు, కోశాధికారి గుండా వెంకన్న, కమిటీ సభ్యులు పిన్నవివేక్‌, ఎకిరాల శ్రీనివాస్‌, టి మురళీధర్‌గౌడ్‌, డాక్టర్‌ రూప్‌నార్‌ రమేష్‌, గడ్డల వెంకన్న, ప్రకాష్‌గౌడ్‌, సాయిని రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-02T22:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising